తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త .. తీపి కబురు అందించిన తెలంగాణ ప్రభుత్వం!

పెండింగ్‌ బిల్లులు, 5 డీఏల బకాయిలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర ఎన్నో సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఆందోళన అవసరం లేదని.. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. ‘ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత. సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించడానికి మంత్రుల ఉప సంఘం, అధికారుల కమిటీని నియమించాం’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై విజ్ఞప్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఉద్యోగుల వద్ద స్వీకరించిన సమాచారాన్ని కమిటీకి పలు దఫాలుగా వివరించారు.

Related posts

నేడు మెస్సీ షో… హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ!

Ram Narayana

నిజామాబాద్ గ్రామీణ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం.. కీలక పత్రాల దగ్ధం…

Ram Narayana

భూములు అమ్ముతూ రాష్ట్రాన్ని నడుపుతోంది తెలంగాణ మాత్రమే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Ram Narayana