జాతీయ వార్తలు

సిందూరం మొక్క‌ను నాటిన ప్ర‌ధాని మోదీ

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సందర్భంగా ప్ర‌ధాని మోదీ ఢిల్లీలోని త‌న నివాసంలో సిందూరం మొక్క‌(Sindoor Sapling)ను నాటారు. గుజ‌రాత్‌లోని కుచ్‌కు చెందిన త‌ల్లులు, సోద‌రీమ‌ణులు ఈ మొక్క‌ను త‌న‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. 1971లో ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధం స‌మ‌యంలో ఆ మ‌హిళ‌లు అసాధార‌ణ సాహ‌సాన్ని, దేశ‌భ‌క్తిని చాటిన‌ట్లు మోదీ తెలిపారు. సోష‌ల్ మీడియా అకౌంట్‌లో మోదీ .. సిందూరం మొక్క నాటిన వీడియోను, ఫోటోల‌ను పోస్టు చేశారు. దేశ మ‌హిళ‌ల ధైర్యానికి, ప్రేర‌ణ‌కు గుర్తుగా సిందూరం మొక్క నిలుస్తుంద‌న్నారు. ఢిల్లీలోని 7 లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌లో ఉన్న నివాసంలో మోదీ ఆ మొక్క‌ను నాటారు.

Related posts

ముంబై- దుబాయ్ విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Ram Narayana

డిజిటల్ అరెస్ట్ పేరుతో మాజీ బ్యాంకర్‌నే బోల్తా కొట్టించారు.. రూ 23 కోట్లు కాజేశారు!

Ram Narayana

బెంగళూరు లాడ్జిలో విద్యార్థి అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన ప్రియురాలి అదృశ్యం!

Ram Narayana