జనరల్ వార్తలు ...

తత్కాల్ టికెట్ బుకింగ్‌లో కీలకమార్పు, ఇకపై అది తప్పనిసరి

ఇండియన్ రైల్వేస్ నుంచి బిగ్ అప్‌డేట్ వెలువడింది. రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. టికెట్ బుకింగ్‌లో చోటుచేసుకుంటున్న మోసాలు అరికట్టేందుకు ఇండియన్ రైల్వేస్ ఈ చర్యలు తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. భారతీయ రైల్వే నుంచి బిగ్ అప్‌డేట్ ఇది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో కీలకమైన మార్పులు చేసింది భారతీయ రైల్వే. తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో జరుగుతున్న మోసాలు అరికట్టేందుకు వెబ్‌సైట్‌ల కీలక మార్పులు చేసింది. తత్కాల్ టికెట్ బుకింగ్ చేసేటప్పుడు సాధారణంగా హ్యాంగింగ్, వేగం తగ్గడం, టికెట్ వెయిటింగ్ లిస్ట్ వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా మోసాలు అరికట్టేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్‌కు ఈ ఆధార్ తప్పనిసరి చేసింది. త్వరలో ఈ కొత్త రూల్ అమల్లోకి రానుంది. దీనివల్ల రైల్వే ప్రయాణీకుడు ఎవరనేది కచ్చితంగా గుర్తించేందుకు సాధ్యమౌతుంది. ప్రయాణీకులు మొబైల్ నెంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసుండాలి. టికెట్ బుక్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో ధృవీకరించుకోవాలి. ఐఆర్సీటీసీ  వెబ్‌సైట్‌లో ఓటీపీ నమోదు చేయాలి. ఐఆర్సీటీసీ ప్లాట్‌ఫామ్‌లో 50 ప్రొపైల్స్ సృష్టించేందుకు ఏజెంట్లు నకిలీ మెయిల్ ఐడీలు ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈ తరహా మోసాలు చెల్లవు. నకిలీ మెయిల్ ఐడీలతో టికెట్ బుకింగ్‌కు చెక్ పడుతుంది. ముఖ్యంగా ఐఆర్సీటీసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారిత బాట్ డిటెక్షన్ సహాయంతో డూప్లికేట్ ఎక్కౌంట్లను గుర్తిస్తుంది. ప్రయోగదశలో ఈ తరహా సాంకేతికత సానుకూల ఫలితాలు చూపించింది. 

Related posts

3 Fitness goals you need to ditch immediately, according to a pro

Ram Narayana

Fitness Tips – How much exercise you need to be healthy

Ram Narayana

ఆశా భోంస్లే ఇక లేరంటూ వార్తలు … స్పందించిన తనయుడు !

Ram Narayana