తెలంగాణ వార్తలు

ఖమ్మంలో లక్షలాదిమందితో 100 సంవత్సరాలు ఎర్రజెండా పండుగ…కూనంనేని

భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో మైలు రాయిగా నిలిచే 100 సంవత్సరాల ఎర్రజెండా పండుగ కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న ఖమ్మంలో జరగడం ఒక చారిత్రిక ఘట్టమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి , కొత్తగూడెం శానసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు .శుక్రవారం ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు .. ఈ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి హాజరుకానున్నారని ఆయన తెలిపారు. సిపిఐ దేశంలో పుట్టి 100 సవంత్సరాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో జరిపేందుకు జాతీయ పార్టీ తమకు అవకాశం ఇవ్వడం గర్వకారణమని అన్నారు .పార్టీ జాతీయ నాయకత్వం అంచనాలకు తగ్గట్లుగా ఖమ్మంలో జిల్లా నాయకత్వం ఏర్పాట్లు చేస్తుందని అన్నారు .18న ఖమ్మంలో ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే సభ చరిత్రలో నిలిచి పోనుందని అన్నారు . లక్షలాది మంది ఈ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు . కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందని,అయితే కమ్యూనిస్టుల అవసరాన్ని గుర్తించి అనేక మంది పార్టీకి దగ్గరవుతున్న విషయాన్నీ మరువరాదని అన్నారు .ప్రజల పక్షాన ప్రధానంగా పేదలు,కార్మికులు , కర్షకులు ,యువకులు ,విద్యార్థులు ,మహిళలు , ఉద్యోగుల ,మధ్యతరగతి ప్రజానీకం , మేథావులు తరుపున గొంతు వినిపించు అనేక పోరాటాలు చేసింది కమ్యూనిస్టులేనని ఘంటా పదంగా చెప్పగలమని ఆయన అన్నారు . భూమి, భుక్తి ,విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు , తేబగా , పున్నప్రవాయిలర్ . చిట్టగాంగ్, గదర్ పార్టీ లాంటి సంఘటనలు ఆయన గుర్తు చేశారు .. దేశంలో సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపు నించ్చిందే కమ్యూనిస్టులు అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని అన్నారు . స్వతంత్ర పోరాటానికి ఊపిరులూది జవసత్వాలు కల్పించిన అనేక మంది యోధులు తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీలు చేరారని అన్నారు ..త్యాగాలకు , పోరాటాల్లో ముందున్న కమ్యూనిస్టుల ప్రమేయం లేకుండా ఈ పాలకులు ప్రజల వైపు చూడటంలేదన్నారు . ఏ పథకం ప్రజలు అందుతుందన్న అంది కమ్యూనిస్టులు ఇచ్చిన నినాదం నుంచే పుట్టిందన్నారు ..బ్యాంకులు జాతీయకరణ , భూసంస్కరణలు , దున్నేవాడికే భూమి , జాతీయ ఉపాధి పథకం , పనిగంటలు , కార్మికుల హక్కులు , పంటలకు గిట్టుబాటు ధరలు , సమానపనికి సమాన వేతనం , కూలి రేట్ల పెంపు , సంఘటిత , అసంఘటిత కార్మికులకు హక్కుల కోసం పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని అన్నారు .. ఇంతటి మహత్తర చరిత్ర కల్గిన కమ్యూనిస్టు పార్టీని ఎర్రజెండాను ముందుకు తీసుకోని పోయేందుకు ఖమ్మం బహిరంగ సభ ధిక్సుచిగా నిలవనున్నదనే విశ్వాసాన్ని సాంబశివరావు వ్యక్తం చేశారు ..

దేశంలో పెరుగుతున్న మతతత్వం ,ఫాసిజం పోకడలను ఎదిరించి నిలవాలంటే , కార్మికులకు రక్షణ కావాలంటే కమ్యూనిస్టులు అవసరం ఉందని గుర్తిస్తున్నారని అందుకే ఇటీవల కాలంలో ఎవరు మాట్లాడిన కమ్యూనిస్టుల గురించి చెప్పకుండా ఉండటం లేదని అన్నారు .ప్రపంచ వ్యాపితంగా కూడా కమ్యూనిస్టుల ప్రాభల్యం ఇటీవల కాలంలో పెరుగుతుందని అన్నారు .చివరకు అమెరికా లోని న్యూయార్క్ నగర మేయర్ గా ఎన్నికైన మందానిని ట్రంప్ ఆయన కమ్యూనిస్టువు ఓట్లు వేయవద్దని అంటే ఎస్ నేను కమ్యూనిస్టునే అని ప్రచారం చేస్తే న్యూయార్క్ ప్రజలు అక్కున చేర్చుకొని అఖండ మెజార్టీ తో గెలిపించారని అన్నారు .

21వ శతాబ్దంలోనూ జాతీయ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనన్నారు. దేశ సంపద రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణను కమ్యూనిస్టులు బాధ్యతగా స్వీకరించారని కమ్యూనిస్టులు లేకుంటే బ్యాంకులు, రైల్వేలు, కోల్ ఇండియా సహా దేశీయ సుప్రసిద్ధ సంస్థలు ఎప్పుడో ప్రైవేట్ శక్తుల పరమయ్యేవని సాంబశివరావు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటం ప్రజాసంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసమేనన్నారు. ఏ స్వేచ్ఛ కోసం పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నామో అదే స్వేచ్చను బిజెపి హరించివేస్తుందన్నారు. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థి, యువజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిపిఐ పోరాడుతుందన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కే క్రమంలోనే పాలకులు యూనియన్ల రద్దు అంటున్నారని మరో పక్క అర్బన్ నక్సలైట్ ముద్ర వేసి నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. 1925లో సిపిఐ ఆవిర్భావించిన తర్వాత నిర్బంధాల నడుమ నిషేధానికి గురైందని కమ్యూనిస్టుల భావాజాలంతో అనేక మంది కాంగ్రెస్ లో చేరి సోషలిస్టు విభాగం ఏర్పాటు చేసి పోరాటం చేశారని కూనంనేని తెలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం కమ్యూనిస్టు నాయకుడు అస్లాత్ మహని తొలిసారి ఇచ్చాడని ఆ నినాదాన్ని భగత్సంగ్ విశ్వవ్యాపితం చేశాడన్నారు. కమ్యూనిస్టుల ప్రత్యామ్నాయమే సరైన ప్రత్యామ్నాయమని ఆయన తెలిపారు. మీరట్, కాన్పూర్, లాహోర్ సహా పలు కుట్ర కేసులను ఎదుర్కొని నిలబడ్డ సిపిఐ మరో వందేళ్లయినా ప్రజల పక్షాన నిలబడేందుకు సిద్దమేనని సాంబశివరావు తెలిపారు. వందేళ్ల వేడుక భవిష్యత్తు పోరాటలకు స్ఫూర్తిని ఇవ్వనుందన్నారు.

రెండవ శతాబ్దంలోనూ ప్రజా పోరాటాలు: ప్రకాష్ బాబు

శతాబ్ద కాలం పాటు పోరాటం సాగించిన సిపిఐ రెండవ శతాబ్దంలోనూ ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి ప్రకాష్ బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ప్రకాష్ బాబు మాట్లాడుతూ 2024 డిసెంబర్ 24 శతాబ్ది ఉత్సవాలు కాన్పూర్లో ప్రారంభమయ్యాయని ముగింపు కమ్యూనిస్టు ఖిల్లా ఖమ్మంలో ముగుస్తున్నాయన్నారు. శతాబ్ద కాలం ప్రజల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం పనిచేశామని అదే సిద్ధాంతం, లక్ష్యంతో భవిష్యత్తులోనూ పోరాడతామన్నారు. మతోన్మాద శక్తులను నిలువరించే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు.

మూడు ప్రదర్శనల ద్వారా సభా స్థలికి బాగం

మూడు ప్రదర్శనల ద్వారా ప్రజలు బహిరంగ సభా స్థలికి చేరుకుంటారని ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. పెవిలియన్ మైదానం నుంచి జనసేవాదళ్ ప్రదర్శన ప్రారంభమవుతుందని దీనికి రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, బాగం హేమంతరావు, నాయకత్వం వహిస్తారని తర్వాత కళాకారుల వృత్తి సంఘాల ప్రదర్శన ఉంటుందన్నారు. రెండవ ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం నుంచి ప్రారంభమవుతుందని దీనికి జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎసి, సాబీర్ పాషా, ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి మూడవ ప్రదర్శన నయాబజార్ కళాశాల కాల్వొడ్డు నుంచి ప్రారంభమవుతుందని దీనికి ఏపి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దండి సురేష్ నాయకత్వం వహిస్తారని హేమంతరావు తెలిపారు. మూడు ప్రదర్శనలు సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతాయని ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద మూడు ప్రదర్శనలకు జాతీయ నాయకులు స్వాగతం పలికేందుకు వేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళారూపాల ప్రదర్శనకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఎస్ కె జానిమియా, కొండపర్తి
గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, బిజి క్లెమెంట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీతారామ లిఫ్ట్ పంప్ హౌస్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Ram Narayana

సౌదీలో తెలుగు వ్య‌క్తి అనుమానాస్పద మృతి!

Ram Narayana

ఇది ప్రజాప్రభుత్వం, అందరం కలిసి పనిచేసి ప్రజలకు మేలు చేద్దాం …మంత్రి పొంగులేటి

Ram Narayana