అంతర్జాతీయం

ఇజ్రాయెల్ దాడి… హర్మూజ్ మూసివేతలో కీలకపాత్ర పోషించిన నౌకాదళ కమాండర్ మృతి…

ఇరాన్‌కు మరో దెబ్బ తగిలింది. బందర్ అబ్బాస్ తీరప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నావికాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి మరణించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారిని ఉటంకిస్తూ ఆ దేశ మీడియా నివేదించింది. 

ఇరాన్‌తో యుద్ధానికి ఐదు రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. చర్చల ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని మూడు రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం కొనసాగుతోంది.

ఈ క్రమంలో హర్మూజ్ జలసంధికి సమీపంలోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ రెజా మృతి చెందారని తెలుస్తోంది. అలీ రెజా తంగ్సిరి 2018 నుంచి నావికాదళ కమాండర్‌గా ఉంటున్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంలో ఈయనది కీలకపాత్రగా భావిస్తున్నారు.

Related posts

జులై వరకు ఈ దేశానికి వీసా లేకుండానే వెళ్లొచ్చట… ఎవరు అర్హులంటే…!

Ram Narayana

ఇద్దరు అమెరికన్ బందీలను విడిచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు

Ram Narayana

60 యుద్ధ విమానాలతో ఇరాన్ లో నిప్పుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ … వందలమంది మృతి

Ram Narayana