ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

‘జగన్ 2.0 – మావిగన్ 2029’ .. జగన్ ఇంటి ముందు ‘మావిగన్’ ఫ్లెక్సీ…

తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద ‘మావిగన్’ ప్లెక్సీ వెలిసింది.  మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (MAVIGUN) కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీపై ఆసక్తికర నినాదాలను పొందుపరిచారు. ముఖ్యంగా “జగన్ 2.0 – మావిగన్ 2029” అనే నినాదం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ‘మావిగన్’ ప్రతిపాదనను పార్టీ ప్రధాన అజెండాగా తీసుకువెళ్లబోతున్నట్లు సంకేతాలిచ్చారు. “యువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్” అంటూ హైలైట్ చేశారు. “ఒక పార్టీ.. ఒక జెండా.. ఒక అజెండా” అని రాసి ఉండటం ద్వారా రాజధాని విషయంలో వైసీపీ కేడర్ అంతా ఒకే మాటపై ఉందనే సందేశాన్ని పంపారు.

రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిన తరుణంలో, జగన్ నివాసం వద్ద ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ద్వారా… అమరావతికి వైసీపీ పూర్తి వ్యతిరేకం అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

Related posts

అధైర్యపడొద్దు… పార్టీ మీ వెన్నంటే ఉంది: మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

Ram Narayana

దమ్ముంటే చర్చకు రా.. ఏబీ వెంకటేశ్వరరావుకు జనసేన నేత బొలిశెట్టి సవాల్!

Ram Narayana

వైసీపీకి గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు..సంతోషంగా ఉందన్న టీడీపీ

Ram Narayana