భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్‌ను విస్తరించాలి…ఖమ్మం ఎంపీ నామ
ఖమ్మం లో రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి
భద్రాచలం -పాండురంగాపురం రైల్వే లైన్ పూర్తిచేయాలి
విభజన చట్టంలోని అంశాలను నిర్లక్ష్యం చేయడం తగదు
డోర్నకల్ -కారేపల్లి మధ్య రెండవ లైన్ ఏర్పాటు చేయాలి
కారేపల్లిలో కొల్హాపూర్ -మణుగూరు రైలు నిలుపుదల చేయాలి
చింతకానిలో కృష్ణ ఎక్స్ ప్రెస్ కు హాల్టింగ్ ఇవ్వాలి
సికింద్రాబాద్ లో జరిగిన దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో ఖమ్మం ఎంపీ నామ
సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో ఖమ్మం ఎంపీ లోకసభలో టీఆర్ యస్ పక్షనేత నామ నాగేశ్వర్ రావు వివిధ అమాశాలను ప్రస్తావించారు. విభజన చట్టంలో తెలంగాణను రైల్వే ద్వారా ఇస్తామన్న ప్రాజెక్టు లో ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఖాజీ పెట్ కోచ్ ఫ్యాక్టరీ , ఇవ్వకపోవడాన్ని ఆయన ప్రస్తహించారు.
భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్‌ను విస్తరించాలని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ జీఎం కాన్ఫరెన్స్ హాల్‌లో జీఎం గజానన్ మాల్యా అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎంపీ నామా మాట్లాడారు. జిల్లాలోని సత్తుపల్లి వరకు రైల్వేపనులు ముగింపు దశకు చేరుకున్నాయని, కొవ్వూరు వరకు రైల్వేలైన్ మంజూరు చేయాలని కోరారు. పాండురంగాపురం-సారపాక మధ్యలో రైల్వే లైన్ నిర్మించేందుకు 2011లోనే రూ.79.82 కోట్లతో అంచనాలు తయారుచేశారని, ఈ రైల్వేలైన్ పూర్తయితే దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలానికి భక్తులు వచ్చేందుకు సులువుగా ఉంటుందని నామా వివరించారు. ఖాజీపేట్ రైల్వేకోచ్ ఏర్పాటుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నామా అసంతృస్తి వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని అంశాలను నిర్లక్ష్యం చేయటం తగదన్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో సీనియర్ సిటిజెన్ల సౌకర్యం కోసం 1,2 ప్లాట్‌ఫారమ్‌లలో ఎస్కలేటర్లు మంజూరు అయ్యాయని, అలాగే 60 సీసీ కెమేరాల ఏర్పాటు త్వరలో జరుగుతుందని నామా వివరించారు. కారేపల్లి రైల్వే స్టేషన్‌లో మణుగూరు-కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని జీఎంను కోరారు. డోర్నకల్-కారేపల్లి మధ్య రెండో రైల్వేలైన్ ఏర్పాటు, చింతకానిలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ నిలుపదలపై రైల్వే జీఎం హామీ ఇచ్చినట్లు ఎంపీ నామా తెలిపారు.