బాస్ భర్తుడే పేరుతొ బల ప్రదర్శనలు
-పోటీ పడ్డ నేతలు
బాస్ భర్తుడే పేరుతో జిల్లాలలో బల ప్రదర్శనలు జరిగాయి . ఇందుకు నేతలు పోటీపడ్డారు. గ్రామాల దగ్గరనుంచి పట్టణాలవరకు మొక్కలు నాటారు కానీ వాటి పోషణపైనే సందేహాలు నెలకొంటున్నాయి. గతంలో నాటిన మొక్కల లెక్కలు తేలాల్సిఉందనే అభిప్రాయాలూ కూడా వ్యక్తం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తడే సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ,మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు , ఇతర చిన్న పెద్ద నాయకులకు ఎంపీ సంతోష్ కుమార్ కోటి మొక్కల అర్చన కు శ్రీకారం చుట్టారు. నిజంగా ఇది మంచి కార్యక్రమమే . దీని వల్ల మొక్కలు నాటటం అంతరించి పోతున్న అరణ్యాలను బతికించుకునేందుకు మంచి అవకాశం . రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున చేపట్టారు. అయితే ఆయా నియోజవర్గాలలో ఇవి బల ప్రదర్శనలకు దారితీశాయి. పోటాపోటీగా మొక్కలు నాటటంతో పాటు తమ సత్తా చాటేందుకు దీన్ని ఉపయోగించుకునేందుకు చాలామంది నేతలు పూనుకున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ యస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ఓడిపోయినా వారు ఒకే నియోజకవర్గంలో పార్టులోని రెండు వారాగాల కార్యక్రమాలపై ఆశక్తి కార చర్చలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో వివిధ నియోజవర్గాలలో ఒకరికంటే మరొకరు ఘనంగా చేయాలనే ఉద్దేశంతో భారీకార్యక్రమాలు చేపట్టారు.
వైరా నియోజకవర్గంలో స్వతంత్రంగా గెలిచి టీఆర్ యస్ లో చేరిన రాములు నాయక్, టీఆర్ యస్ టికెట్ పొంది ఓడిపోయినా మదన్ లాల్ లు నిర్వవించిన కార్యక్రమాలు జిల్లాలో చర్చకు దారీ తీశాయి. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కొణిజర్ల మండలం తనికెళ్ళ నుంచి వైరా వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ,రక్తదానం నిర్వవించగా , ఎమ్మెల్యే రాములు నాయక్ మహిళలతో బోనాల ప్రదర్శన , రక్త దానశిబిరం నిర్వించారు. జిల్లా కేంద్రం ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామ నాగేశ్వరరావు , మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , ఇల్లందులో హరిప్రియ , కోరం కనకయ్య , మధిరలో లింగాల కమల్ రాజ్ , అశ్వారావు పేట నియోజకవర్గ పరిధిలోని మండలకేంద్రమైన చండ్రుగొండలో రెండువర్గాలుగా చీలిపోయి టీఆర్ యస్ నాయకలు మొక్కలు నాటారు.మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వగ్రామమైన గండుగులపల్లిలో మొక్కలు నాటారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాలలో నాయకులూ పోటీలు పది మరీ కేసీఆర్ బర్తడే వేడుకలు నిర్వవించారు.