Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లోకల్ వార్ లో కుదేలైన టీడీపీ …ఫ్యాన్ స్పీడ్ కు తిరుగులేదని నిరూపించిన ప్రజలు

లోకల్ వార్ లో కుదేలైన టీడీపీ …ఫ్యాన్ స్పీడ్ కు తిరుగులేదని నిరూపించిన ప్రజలు…
-కుప్పంలో చంద్రబాబు కు భారీ షాక్…టీడీపీ కంచుకోటలో వైసీపీ పాగా!
-నెల్లూరు కార్పొరేషన్ లో క్లిన్ స్వీప్
-12 మున్సిపాలిటీలలో 11 వైసీపీ , ఒక్క మున్సిపాలిటీలో టీడీపీ
-కుప్పం లో 25 స్థానాల్లో వైసీపీ 19 , 6 స్థానాలకే టీడీపీ పరిమితం
-రాష్ట్ర టీడీపీ నేతలంతా ప్రచారం చేసిన దక్కని ఫలితం

ఏపీ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ ముందు టీడీపీ కుదేలైంది . టీడీపీ కంచుకోటగా భావిస్తున్న కుప్పం కోటకు బీటలు వారాయి. హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో కుప్పం మొదటి సరిగా వైసీపీ జయకేతనం ఎగరవేసింది. దీంతో టీడీపీ భారీ షాక్ కు గురైంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ కుప్పం ఓడిపోవడం తో టీడీపీ కార్యకర్తలు నిరాశకు గురైయ్యారు . మున్సిపాలిటీ లో ఉన్న 25 స్థానాల్లో 19 స్థానాల్లో వైసీపీ , గెలుచుకోగా , టీడీపీ 6 స్థానాలకే పరిమితమైంది. ఇక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 54 కార్పొరేటర్లకు గాను 54 సీట్లు గెలుచుకోవడం విశేషం . ఇక్కడ టీడీపీ పూర్తిగా గల్లంతు అయింది.

టీడీపీ కంచుకోట, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంను వైసీపీ బద్దలు కొట్టింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది.ఎన్నికలకు ముందు కుప్పంలో ఎంత హైడ్రామా నడిచిందో తెలిసిందే. టీడీపీకి చెందిన నేతలను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదులు చేసింది. ఎన్నికల లెక్కింపులో అక్రమాలు జరుగుతాయంటూ హైకోర్టు ను సైతం ఆశ్రయించింది. అయినప్పటికీ ప్రజలు టీడీపీ మాటలను నమ్మినట్లు లేరు.

10 పురపాలికలు వైసీపీ కైవసం!
మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ హవా
నెల్లూరు కార్పొరేషన్ లో 28 వార్డులు సొంతం

ఏపీ పురపాలికల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది . ఇప్పటిదాకా అధికార పార్టీ 10 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పం, నెల్లూరు, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో జయకేతనం ఎగురవేసింది. ప్రకాశం జిల్లాలోని దర్శి , కృష్ణ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలలో వైసీపీ వెనకబడింది. దర్శి టీడీపీ గెలుచుకోగా , కొండపల్లి లో 29 స్థానాలకు వైసీపీ , టీడీపీ చేరి 14 సీట్లు గెలుచుకోగా , స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు .

 

Related posts

ప్రజాస్వామ్యం అపహాస్యం… పట్టభద్రుల ఓటుకు సైతం వెల కట్టిన నేతలు

Drukpadam

వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

పొంగులేటి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారా…?

Drukpadam

Leave a Comment