Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం.. కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్న సీఎం!

  • జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితం భేటీ అయిన కేబినెట్
  • మూడు రాజధానుల రద్దు నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించనున్న జగన్
  • ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కాసేపటి క్రితం జరిగిన కేబినెట్ మీటింగులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో జగన్ ప్రకటించబోతున్నారు. రాజధానికి సంబంధించి కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

మరోవైపు వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్టు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అమరావతి కేసులను విచారిస్తున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కొడాలి నానిని మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా… అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను బయటకు చెప్పడం నిబంధనలకు విరుద్ధమని… ఆ విషయం గురించి అసెంబ్లీలో సీఎం జగన్ చెపుతారని అన్నారు.

Related posts

భూముల పరిహారం పెంచాలంటే రైతులపై కేసులు …యూ పీ ప్రభుత్వ నిర్వాకం…

Drukpadam

నా తండ్రి హత్యను రాజకీయంగా వాడుకుని జగన్ లబ్ధిపొందారు: వివేకా కుమార్తె సంచలన వాంగ్మూలం

Drukpadam

ప్రభుత్వంలో అవినీతి జరిగితే ఉద్యోగులు, సీఎం తలదించుకోవాల్సి వస్తుంది: మంత్రి బొత్స!

Drukpadam

Leave a Comment