Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన తెరాస…పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్న సిపిఐ…

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన తెరాసపార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్న సిపిఐ
సానుకూలంగా స్పందించిందన్న టీఆర్ యస్
మంత్రి అజయ్ ఆధ్వరంలో సిపిఐ కార్యాలయానికి టీఆర్ యస్ నేతలు
సిపిఎం పార్టీ ని కూడా కలుస్తామన్న టీఆర్ యస్ నేతలు
వామపక్షాల వైఖరి ఒకేలా ఉండవచ్చునంటున్న నేతలు
ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో సిపిఐ మద్దతును టీఆర్ యస్ కోరింది. ఈ మేరకు తెరాస పార్టీ తరుపున రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి , అభ్యర్థి తాత మధు సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.

 

ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి తాతా మధుకు తమ మద్దతు ఇవ్వాలని సిపిఐ నాయకులను టీఆర్ యస్ నాయకులూ కోరారు . దీంతో టీఆర్ యస్ కు మద్దతు పై రాష్ట్రపార్టీలో చర్చంచకుండా నిర్ణయం చెప్పటం కుదరదని ,పార్టీ నాయకులూ సిపిఐ కార్యాలయానికి వచ్చిన టీఆర్ యస్ నేతలు స్పష్టం చేశారు. అయితే సిపిఐ సానుకూలంగా స్పందించిందని టీఆర్ యస్ నేతలు ప్రకటించడం సిపిఐ నేతలకు కొంత ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది. తాము ఎలాంటి నిర్ణయం చెప్పకుండానే సానుకూలంగా స్పందించినట్లు టీఆర్ యస్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.టీఆర్ యస్ నాయకుల భేటీ లో సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గారు, సీపీఐ సీనియర్ నాయకులు భాగం హేమంత రావు గారు, మౌలానా , జమ్ముల జితేందర్ రెడ్డి, జానిమియాతో పాల్గొన్నారు .
మద్దతు విషయంలో పార్టీ టు పార్టీ మధ్య చర్చలు జరగలిగాని వ్యక్తిగతంగా ఉండదని సిపిఐ నాయకులూ పేర్కొంటున్నారు. సిపిఐ నేతలను కలిసిన టీఆర్ యస్ నేతలు సిపిఎం మద్దతు కూడా కోరతారని తెలిసింది. అయితే వారు ఇంకా సిపిఎం నేతలను కలవలేదు . సిపిఐ ,సిపిఎం వైఖరి ఒకేలా ఉంటుందనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ యస్ కు మద్దతు ఇస్తే ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ వెళ్తుందని కొందరి నేతల అభిప్రాయం . చూద్దాం ఏమి జరుగుతుందో ….

Related posts

కుప్పం మున్సిపల్ వార్ …వైసీపీకి ప్రజాబలం లేదని లోకేష్ విమర్శలు!

Drukpadam

ఈటల బీజేపీ లో చేరికకు రంగం సిద్ధం …..ప్రత్యేక విమానంలో బీజేపీ నాయకుల రాక…

Drukpadam

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: బ్రహ్మానందం!

Drukpadam

Leave a Comment