Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెండింగ్ కేసుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి…డీజీపీ మహేందర్ రెడ్డి…

పెండింగ్ కేసుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి
-పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసులపై క్షేత్రస్ధాయిలో అధికారిల పర్యవేక్షణ
-ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో ఉత్తమ ఫలితాల కోసం శిక్షణ తరగతులు
-నేరసమీక్ష సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిజిపి యం.మహేందర్ రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు.

మంగళవారం పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణ ద్వారానే
పెండింగ్ కేసులలో పురోగతి సాధించాలని వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. పోక్సో యాక్ట్ , క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ , గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొవాలని సూచించారు.

ఫంక్షనల్ వర్టికల్స్ అమలులో అధికారులు,సిబ్బంది ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అందుకు అవసరమైన శిక్షణ తరగతులు తీసుకొవాలని సూచించారు.పోలీసు అధికారులు, సిబ్బంది సర్వీసు కు సంబంధించిన పూర్తి సమాచారం,వివరాలు, ఆన్‌లైన్‌ అప్లోడ్ ప్రక్రియ, హ్యూమన్‌ రిసోర్సు మేనేజ్‌మెంట్‌ సిస్టం ఎంట్రీ, తదితర అంశాలపై డీజీపీ సమీక్ష నిర్వహించారు

పెండింగ్ లో వున్న కేసులు, కేసుల డిస్పోజల్స్, కన్వెక్షన్ కు సంబంధించిన ఆంశలపై అధికారులతో చర్చించారు.

ఖమ్మం పోలీసు కమిషనర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హల్ పాల్గొన్న
పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ మాట్లాడుతూ పెండింగ్ కేసులను సైతం క్లియర్ చేసే విధంగా జిల్లా ఏసీపీలు, సిఐలతో ఎప్పటికపుడు సమీక్షించి కేసుల సంఖ్యను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని డిజిపికి వివరించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో డీసీపీ LC. నాయక్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ అడిషనల్ డీసీపీ కె. ప్రసాద్, AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి,అంజనేయులు, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

Related posts

Drukpadam

తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ కు చుక్కెదురు …ఉస్మానియా యూనివర్శిటీ కి రాహుల్ కు నో పర్మిషన్…

Drukpadam

రాహుల్ అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్…!

Drukpadam

Leave a Comment