Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం…

ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం…
సర్కార్ కు ప్రతిపాదనలు పంపిన టీఎస్ ఆర్టీసీ
ఆర్టీసీ నష్టాల్లో ఉంది.. టికెట్ ధరలు పెంచండి
తెలంగాణ ప్రభుత్వానికి సజ్జనార్ ప్రతిపాదనలు
ఆర్డినరీ బస్సులో కి.మీ.కు 20 పైసలు పెంచాలి
ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచాలని ప్రతిపాదనలు
వారం రోజుల్లో టికెట్ ధరలు పెంచే అవకాశం

ఎప్పటినుంచో పెంచాలని అనుకుంటున్నా టీఎస్ ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఆర్టీసీ అధికారులు తయారు చేసిన నివేదికను ఆశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఆర్టీసీ చైర్మన్ బాజీ రెడ్డి గోవర్ధన్ , ఎం డి సజ్జనార్ ఇతర అధికారుల సమక్షం లో సుదీర్ఘ చర్చల అనంతరం పెంచాల్సిన చార్జీల పై ఒక నిర్ణయానికి వచ్చి ముఖ్యమంత్రి అంగీకారం కోసం ప్రభుత్వానికి ఫైల్ పంపించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ డీజిల్ ధరలు విపరీతంగా పెరగటంతో సంస్థ తీవ్ర నష్టాల్లో ఉందని అందువల్ల చార్జీలు పెంచాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కరోనా వల్ల కూడా ఆర్టీసీ కి ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు ల సంఖ్యను కూడా పెంచాలని అందువల్ల కొత్త బస్సు లను కొనుగోలు చేయాల్సి ఉందని అన్నారు. అంతకు ముందు మంత్రి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ , ఎండి సజ్జనార్ లతో ఇతర అధికారులతో సమీక్షా నిర్వవించారు.

తెలంగాణలో ఆర్టీసీ టికెట్ల ధరలు పెరగనున్నాయి. టికెట్ ధరలను పెంచాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనలు పంపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్ కు 20 పైసలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్ కు 30 పైసలు పెంచాలని ఆయన ప్రతిపాదించారు. సజ్జనార్ ప్రతిపాదనల మేరకు కొత్త రేట్లు మరో వారం రోజుల్లోగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ… టికెట్ ఆదాయం పైనే ఆర్టీసీ ఆధారపడి ఉందని తెలిపారు. టికెట్ ధరలను పెంచి రెండేళ్లయిందని చెప్పారు. పెరిగిన డీజిల్ ధరలు ఆర్టీసీకి మరింత భారంగా పరిణమించాయని తెలిపారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై అదనంగా రూ. 468 కోట్ల భారం పడుతోందని సజ్జనార్ తెలిపారు. ఈ ఏడాది రూ. 1,400 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని చెప్పారు.

Related posts

అల్లర్లలో పాల్గొంటే సైన్యంలో ఉద్యోగం రాదు: వాయుసేనాధిపతి!

Drukpadam

డాక్టర్లపై దాడులకు నిరసనగా 18న దేశవ్యాప్త ఆందోళనకు: ఐఎంఏ…

Drukpadam

ఎన్నికల పనులు పూర్తీ చేయాలి …రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

Drukpadam

Leave a Comment