Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ జాగిలం రీనా మృతి…

భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ జాగిలం రీనా మృతి…
-రీనా మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్
-నేరస్థుల జాడను కనిపెట్టడంలో అత్యంత ప్రతిభ కలిగిన రీనా
-ఎన్నో కేసులను చేధించిన రీనా….రీనా సేవలు మరువలేనివని
-బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అనేక పతకాలు సంధించిన రీనా

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న పోలీసు జాగిలం రీనా అనారోగ్య కారణాలతో మరణించింది.నేరస్థుల జాడను కనిపెట్టడంలో అత్యంత ప్రతిభ కలిగిన రీనా మృతి చెందడం చాలా బాధాకరమని ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.పోలీసు జాగిలం రీనా తన సర్వీసులో ఎన్నో కేసులను చేధించడం మరియు పతకాలను సాధించిండం గర్వకారణమని తెలిపారు.రీనా సేవలు మరువలేనివని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
2013వ సంవత్సరంలో బేసిక్ కోర్స్ నందు రెండవ స్థానాన్ని పొంది మంచి గుర్తింపును సాధించింది.2019వ సంవత్సరంలో రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకాన్ని సాధించడం జరిగింది.వేంసూరు,వి.ఎం బంజర్,అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన మర్డర్ కేసుల్లో రీనా నిందితులను పట్టించడంలో కీలకంగా వ్యవహరించింది.2017లో కల్లూరు పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్దకోరుకోండి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పట్టించడంలో కూడా ప్రధాన పాత్రను పోషించింది.2015లో హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో ప్రధమ బహుమతిని సాధించింది.

కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న రీనాను చికిత్స నిమిత్తం డిసెంబర్ 30 నుండి మూడు రోజుల పాటు కొత్తగూడెం వెటర్నరీ హాస్పిటల్లో చేర్పించి వైద్యుల సూచన మేరకు ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.మొయినాబాద్ ఆసుపత్రిలో చికిత్సలు చేయించి మూడు రోజుల క్రితం కొత్తగూడెం తీసుకురావడం జరిగింది.ఈ రోజు ఉదయం రీనా మరణించడం జరిగింది.రీనా గత 9 సంవత్సరాలుగా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగుల్ మీరా సంరక్షణలో ఉందని తెలిపారు. ఈ రోజు అధికారిక లాంఛనాలతో రీనాకు అంతిమ సంస్కారాలను నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలియజేసారు.

Related posts

శ్రీలంక ఒక్కటే కాదు… అనేక దేశాలు ఆర్థికంగా కుదేల్!

Drukpadam

Drukpadam

వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు …కొత్తగూడెం కేంద్రంగా డీహెచ్ శ్రీనివాసరావు…

Drukpadam

Leave a Comment