Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పీఆర్సీ పీట ముడి …మాట్లాడుకుందాం రండి …మీతో మాటల్లేవు!

పీఆర్సీ పీట ముడి …మాట్లాడుకుందాం రండి …మీతో మాటల్లేవు!
-ఏపీ ప్రభుత్వానికి …ఉద్యోగుల మధ్య కొనసాగుతున్న వార్
-ముగిసిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం
-విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ
-పీఆర్సీ, ఇతర అంశాలపై చర్చ
-ప్రభుత్వంతో చర్చలకు వెళ్లరాదని నిర్ణయం
-చర్చలకు మరోసారి ఆహ్వానించిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగసంఘాల దాన్ని ఆమోదించేది లేదని బీష్మించుకు కూర్చున్నాయి. ఒక పక్క ప్రకటించిన కొత్త పీఆర్సీ తో ప్రభుత్వం ముందుకు పోతుండగా ,ఉద్యోగసంఘాల సమ్మెకు సమాయత్తం అవుతున్నాయి. దీంతో పీఆర్సీ విషయంలో పీటముడి పడింది. ప్రభుత్వం తాను ప్రకటించిన పీఆర్సీ విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఉద్యోగులకు ఉన్న సందేహాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అందుకోసం అధికారులు , మంత్రులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగసంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించింది. కనీసం రేపు అయినా కమిటీ ముందు హాజరు కావాలని ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉద్యోగసంఘాల తెలిపారు .

ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాల నేతలు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. రేపు చర్చలకు రాబోవడంలేదని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసినప్పుడే చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

అయితే, శశిభూషణ్ కుమార్ ఉద్యోగ సంఘాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలంటూ మరోసారి ఆహ్వానించారు. చర్చల్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సీఎస్ సమీర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొంటారని వివరించారు.

Related posts

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ కు బాంబే హైకోర్టు విధించిన షరతులు ఇవే!

Drukpadam

జనాభా పెంచుకునేందుకు చైనా కొత్త కార్యక్రమం…

Drukpadam

ఇకపై కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే చోట…

Drukpadam

Leave a Comment