Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పగబట్టిన కాకి.. గుర్తించి కొందరిపైనే దాడి!

పగబట్టిన కాకి.. గుర్తించి  కొందరిపైనే దాడి!

  • కర్ణాటకలోని ఓబళాపురం గ్రామంలో ఘటన
  • గోళ్లతో గీరుతూ, ముక్కుతో పొడుస్తూ దాడి
  • ఏడుగురిపైనే దాడి

కాకి పగబట్టింది….వినడానికి ఇది విచిత్రంగా ఉన్న ఇది నిజం …కర్ణాటకలోని ఓబుళాపురం అనే గ్రామంలో ఒక కాకి గ్రామంలోని కొందరిని టార్గెట్ చేసుకొని వారిపై మాత్రమే దాడిచేయడం ఆగ్రామస్తులను విస్తుగొలిపే అంశంగా మారింది. కేవలం గ్రామంలోని ఏడుగురిని లక్ష్యంగా చేసుకొని అది వారి ఎంతమందిలో ఉన్న వారిపై దాడిచేసి కళ్ళలో పొడవడం రక్కడం చేస్తుంది. దీనిపై గ్రామస్తులు అందరు కలిసి కాకిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేసిన అది తప్పించుకొని పోతుంది.

కాకులు పగబడతాయా? పగబట్టి ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయా? అవుననే అంటున్నారు కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామస్థులు. తమ గ్రామంలో కొందరిపై కాకి పగబట్టి దాడి చేస్తోందని వాపోతున్నారు. దానికి భయపడి ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో కొన్ని రోజులుగా సంచరిస్తున్న ఓ కాకి గ్రామస్థుల్లో కొందరిని మాత్రమే టార్గెట్ చేసుకుంది. వారు గుంపులో ఉన్నా సరే ఎగిరొచ్చి వారిపైనే దాడిచేస్తోంది. గోళ్లతో రక్కుతూ, ముక్కుతో పొడుస్తోందని, మొత్తంగా గ్రామంలోని ఏడుగురిపై అది పగబట్టి దాడిచేస్తోందని గ్రామస్థులు తెలిపారు. గ్రామం నుంచి కాకిని తరిమేందుకు ప్రయత్నిస్తున్నా వెళ్లడం లేదని గ్రామస్థులు తెలిపారు.

Related posts

మాట …మర్మం

Drukpadam

కారణజన్ముడు సీఎం కేసీఆర్ : ఎంపీ నామ నాగేశ్వరరావు…

Drukpadam

ఎలక్ట్రిక్ వాహనాలనే వాడండి.. రాష్ట్రాలకు కేంద్ర మంత్రి లేఖ!

Drukpadam

Leave a Comment