Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రఘురామకృష్ణరాజు విషయంలో ఏమైనా జరగొచ్చు: సోము వీర్రాజు

రఘురామకృష్ణరాజు విషయంలో ఏమైనా జరగొచ్చు: సోము వీర్రాజు
-బీజేపీలో చేరి పోటీ చేసే అవకాశంపై సోము వీర్రాజు స్పందన
-ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు రూ. 5 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు
-మేం అధికారంలోకి వస్తే తక్కువ ధరకే ఇసుక
-ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడతాం
-వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయని, ఈ కారణంగా అభివృద్ధి కుంటుపడుతోందని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు రూ. 5 వేల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అతి తక్కువ ధరకే ఇసుక అందిస్తామన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీర్రాజు తెలిపారు.

టిడ్కో ఇళ్లను కేంద్రం సాయంతో పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనతో కలిసే పోటీ చేస్తామని తెలిపారు. వైసీపీ రెబల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరి పోటీ చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సోము వీర్రాజు బదులిస్తూ.. ‘ఏదైనా జరగొచ్చు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటివరకు రఘురామ కృష్ణంరాజు బీజేపీ లో కాకుండా జనసేన తరుపున పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ బీజేపీ కూడా ఆయన్ను చేర్చుకోవడం ద్వారా నరసాపురం ఎన్నికల్లో పోటీచేసి సత్తా చాటాలని చూస్తుంది.అందుకోసం బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. ఒక సందర్భంలో టీడీపీలో చేరాలని భావించిన రఘురామ ,అందులో చేరితే వారినే వారు రక్షించుకునే స్థితిలో లేనందున లాభం లేదని భావించారు. జనసేన లో చేరితే అటు టీడీపీ ఇటు బీజేపీ మద్దతు దక్కుతుందని అనుకున్నారు . కానీ బీజేపీ వత్తిడి మేరకు ఆయన ఆ పార్టీ లో చేరే అవకాశం ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్ష సంకేతాలు ఇచ్చారు .

Related posts

నేటితో మున్సిపోల్ ప్రచారం బందు…

Drukpadam

హుజురాబాద్ ఆపరేషన్ నేరుగా రంగంలోకి దిగిన హరీష్ రావు!

Drukpadam

సుపరిపాలన కోసం మంచి నిర్ణయం…మాజీ ఎంపీ పొంగులేటి…

Drukpadam

Leave a Comment