Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కేసీఆర్ వార్నింగ్!

  • మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కేసీఆర్ వార్నింగ్!
    -హోళిరోజు అనుచరులకు పబ్లిక్ గా మందు తాగిస్తూ చిందులు
    -భాద్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి పిల్ల చేష్టలు పై గరం గరం
    -గతంలో కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి
    -మందు తాగిస్తూ చిందులు వేసిన ఎమ్మెల్యే
    -ఎమ్మెల్యేపై వెల్లువెత్తిన విమర్శలు
    -ఇంకో సారి ఇలా చేస్తే పార్టీ నుంచి సాగనంపుతానన్న కేసీఆర్మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రజలతో ఎంతగా కలిసి పోతారో అంతగా చిల్లర పనులు చేస్తారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఆయన అనేక వివాదాల్లో విరుక్కున్నారు . ఐఏఎస్ అధికారి విషయంలో కూడా ఆయన అనుచిత ప్రవర్తన విమర్శల పాలైంది. అప్పట్లోనే ఆయనకు తిరిగి టికెట్ ఇచ్చేంది అనుమానమేనని ప్రచారం జరిగింది. కేసీఆర్ ఎందుకో పెద్ద మనసుతో ప్రవర్తన మార్చుకోవాలని సున్నితమైన వార్నింగ్ ఇచ్చి టికెట్ ఇచ్చారు . ఎమ్మెల్యే కూడా తన ప్రవర్తన చాల వరకు మార్చుకున్నప్పటికీ అప్పుడపుడు పట్టాలు తప్పుతున్నారని విమర్శలు ఉన్నాయి. అయితే హోలీ రోజు తెలంగాణాలో పెద్ద ఎత్తున రంగులు చల్లుకోవడం , అలయ్ బలయ్ ఆడటం మాములు సరదాకోసమే ఎమ్మెల్యే కూడా ఆడారు . అంతవరకూ తప్పులేదు . కానీ స్వయంగా ఎమ్మెల్యే తన అనుచరులకు మందు నోట్లో పోయడం అందులో పండగ సందర్భంగా ప్రభుత్వం మందు షాపులు తెరవకున్న ప్రభుత్వ ఎమ్మెల్యే గా ఉన్న శంకర్ నాయక్ స్వయంగా మందుబాటిల్ తో చిందులు వేయడం పై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లు ఎత్తయి. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు చేరింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు .

    ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోలీ పండుగ రోజు రచ్చ పై ఇదేమి పద్దతి ఒక భాద్యత గల ఎమ్మెల్యే గా ఉన్న నువ్వు ఇలాగనేనా చేసింది . నీ పరువు కాదు పార్టీ పరువు పోతుంది . అనుచరులకు మందు నోట్లో పోస్తూ, డ్యాన్సులు పిల్ల చేష్టలు కావా ? అని మండిపడ్డారు . . ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యేపై విమర్శలు చెలరేగాయి. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఇప్పటికే మీపై చాలా ఫిర్యాదులు వచ్చాయని సీఎం మండిపడ్డారు. పార్టీ పరువు తీసే పనులు చేసేటట్టయితే… పార్టీ నుంచి వెళ్లి పోవాలని స్పష్టం చేశారు. ఇలా చేయడం క్షమించరాని నేరమని… మరోసారి ఇది రిపీట్ అయితే పార్టీ నుంచి సాగనంపుతానని హెచ్చరించారు.

Related posts

భార్యాభర్తలను ఒకేచోటుకి చేర్చుతానన్న సీఎం కేసీఆర్ మాటనిలబెట్టుకోవాలి!

Drukpadam

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌!

Drukpadam

సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నా: ఈటల ప్రకటన

Ram Narayana

Leave a Comment