అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగానేనా ….?ప్రజాసమస్యలు పట్టవా ??
ప్రారంభమైన కొద్దీ సేపటికే .. 12వ తేదీ వరకు అసెంబ్లీ వాయిదా
ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశాలు
మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డిల మృతికి సంతాపం ప్రకటించిన సభ్యులు
కాసేపట్లో ప్రారంభం కానున్న బీఏసీ సమావేశం
ఎన్నికలు ,అధికారం , సీట్లు తగ్గితే నోట్లు పెట్టి కొనడం …ప్రతిపక్షాలను బలహీన పర్చడం …అసలు లేకుండా చేయడం ఇది తాజాగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంగా
వర్దిల్లుతున్న భారత్ లో నెలకొన్న పరిస్థితులు …కేంద్రంలో మోడీ సర్కార్ కానీ రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ కు గాని అనుసరిస్తున్న తీరు . తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. కనీసం 20 రోజులు జరుగుతాయని అనుకున్న అందుకు విరుద్ధంగా సమావేశాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి ఏ ఏ అంశాలమీద చర్చ జరగాలి అనేది బిజినిస్ అడ్వైజరీ కమిటీ సమావేశం లో నిర్ణయిస్తారు . కానీ అది జరగక ముందే అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేస్తూ తిరిగి ఈ నెల 12 వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించడంపై బీజేపీ మంది పడుతుంది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ నాటి సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభ ప్రారంభమైన వెంటనే ఇటవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపారు. మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డిల మృతికి సంతాపాన్ని ప్రకటించారు. వీరి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం తమ తమ శాఖలకు చెందిన నివేదికలను విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, పర్యాటక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అనంతరం, సభను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేశారు. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.