Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి రాజీనామా.. వెంటనే ఆమోదం తెలిపిన స్పీక‌ర్ త‌మ్మినేని…

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి రాజీనామా.. వెంటనే ఆమోదం తెలిపిన స్పీక‌ర్ త‌మ్మినేని…
-గురువారం ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాలు
-తొలి రోజే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి ర‌ఘుప‌తి రాజీనామా
-సోమ‌వారం కొత్త డిప్యూటీ స్పీక‌ర్‌ను ఎన్నుకునే అవ‌కాశం

ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా సంచలనంగా మారింది. శబ్దం లేని పీడుగులా ఆయన రాజీనామా అంశం చర్చనీయాంశం అయింది . రేపో మాపో కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు .అయితే ఇది సీఎం జగన్ నిర్ణయం మేరకే జరిగిందని సమాచారం . దీనిపై ప్రతిపక్షాల నుంచి ఎలాంటి స్పందన లేదు .

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌గా కొన‌సాగుతున్న వైసీపీ ఎమ్మెల్యే కొన ర‌ఘుప‌తి ఆ ప‌ద‌వికి రాజీనామా చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా కొంత‌సేపు స్పీక‌ర్ స్థానంలో క‌నిపించిన ర‌ఘుప‌తి ఆ త‌ర్వాత త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ర‌ఘుప‌తి రాజీనామాను స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వెనువెంట‌నే ఆమోదించారు.

అయితే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కోన ర‌ఘుప‌తి ఎందుకు రాజీనామా చేశార‌న్న విష‌యం మాత్రం వెల్ల‌డి కాలేదు. ర‌ఘుప‌తి రాజీనామాతో ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఖాళీ అయ్యింది. ఈ స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు సోమ‌వారం నాటి స‌మావేశాల్లో ఎన్నిక నిర్వహించనున్నట్టు స‌మాచారం.

Related posts

సిద్ధరామయ్య కేబినెట్లోకి 24 మంది కొత్త మంత్రులు.. ఎవరెవరు, ఏయే సామాజికవర్గాలకు చెందినవారంటే..?

Drukpadam

బీజేపీలో లుకలుకలు …ఈటెల ,రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలు దూరం …దూరం …

Drukpadam

కమ్మోళ్లను హేళన చేస్తున్నారు…జగన్ పై రేణుకాచౌదరితీవ్ర   వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment