Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగిపై బీఆర్ యస్ నేత ఆగడాలపై ప్రభుత్వ ఉద్యోగవర్గాల్లో చర్చ..

ప్రభుత్వ ఉద్యోగిపై బీఆర్ యస్ నేత ఆగడాలపై ప్రభుత్వ ఉద్యోగవర్గాల్లో చర్చ..
-యూనియన్ నేతలు , అధికారులు సీరియస్
-బెల్లం వేణుపై చర్యలకు డిమాండ్
-ఖమ్మం సీపీ కలిసి వినతిపత్రం అందజేసిన బీఎస్పీ నాయకులు

దేవాదాయ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని మమతను బెదిరించిన బీఆర్ యస్ నేత బెల్లం వేణుపై ఉద్యోగవర్గాల్లో చర్చ జరుగుతుంది. టీన్ జి ఓస్ నేతలు కూడా ఈ సంఘటనపై సీరియస్ గా ఉన్నారు . బీఎస్పీ నేతలు జిల్లా పోలీస్ కమిషనర్ ను కలిశారు .
ఆర్ . సమతని దూషించి బెదిరించిన బీఆర్ యస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు నేడు ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు . పాలేరు ఎమ్మెల్యే ఉపేందరరెడ్డి
ముఖ్య అనుచరుడు గా ఉంటూ మండలంలో తన ఇష్టారాజ్యంగా వ్యవరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని అందువల్ల బెల్లం వేణుగోపాల్ ని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు .

దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రెంటాల సమతని దూషించి, బెదిరించడమే కాకుండా ఆమె ఆత్మహత్యా యత్నానికి కారకుడైన బీఆర్ యస్ పార్టీ ఖమ్మం రూరల్ మండలం అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ విషయంలో ప్రభుత్వం యంత్రాంగం సరిగా వ్యవహరించకపోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని తెలిపారు .

ఎస్సీ ,ఎస్టీ ఎట్రాసిటీ కేసుతో, పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్ ని వెంటనే అరెస్ట్ చేయాలని ఖమ్మం సీపీ ని కలిసి మెమోరాండం ఇచ్చారు .

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి , పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్బి. ఉపేందర్, జిల్లా కార్యదర్శి మిరియాల నాగరాజు,జిల్లా సీనియర్ నాయకులు పల్లెపోగు విజయ్, జిల్లా మహిళా కన్వీనర్ ఉప్పల మంజుల, బిట్ సెల్ ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ స్వేరో బచ్చలకూరి, పాలేరు అసెంబ్లీ సీనియర్ నాయకులు బచ్చలకూరి బాలారాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖేశ్ అంబానీ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం… ట్యాక్సీ డ్రైవర్ ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు!

Drukpadam

ఉబర్ డ్రైవర్ మెసేజ్ చూసి భయపడి పోయిన ప్రయాణికుడు …

Ram Narayana

రూ. కోటి విలువైన బంగారం బూట్లలో దాచి..

Ram Narayana

Leave a Comment