ఇక ఖమ్మం జిల్లాకు ఆక్సిజన్ కొరత ఉండదు. ఐటీసి నుంచి ఇక ప్రతి రోజూ 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను ఖమ్మం జిల్లాకు మాత్రమే సరఫరా చేస్తుంది.
ఈ ట్యాంకర్ ను మంత్రి గురువారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో జెండా ఊపి ప్రారంభిస్తారు.
రవాణా మంత్రి హోదాలో మంత్రి అజయ్ కుమార్ రవాణా విభాగం నుంచి ఐదు మెట్రిక్ టన్నుల ట్యాంకర్ ను ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాకు కేటాయింప చేసారు.
భద్రాచలం ఐటీసి రేపటినుంచి ప్రతి రోజు ఈ టాంకర్ ను ఆక్సీజన్ తో నింపి ఖమ్మం అధికార యంత్రాంగానికి అందచేస్తుంది.
ఈ ఆక్సిజన్ ఖమ్మం ప్రభుత్వ ప్రయివేటు ఆసుపత్రుల ఆక్సిజన్ అవసరాలను తీరుస్తుంది. ఇక ఖమ్మం జిల్లా ఆక్సీజన్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు.
ఇదంతా కేవలం మంత్రి అజయ్ కుమార్ చొరవతో జరిగిన పరిణామం. టాంకర్ ను ఖమ్మం జిల్లాకు కేటాయింపచేయడానికి, ఐటీసి కచ్చితంగా ప్రతిరోజూ 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఖమ్మం జిల్లాకు మాత్రమే సరఫరా చెయ్యడానికి మంత్రి తన శక్తి యుక్తులను, తనకు ఉన్నత స్థాయిలో ఉన్న సంబందాలను ఉపయోగించారు.