Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత!

ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత!

  • ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు
  • దాదాపు 8 గంటలపాటు విచారించిన ఈడీ
  • మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి హైదరాబాద్‌కు
  • బేగంపేట నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు
  • ఈడీ విచారణ జరిగిన తీరును తండ్రికి వివరించిన కవిత

ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 8 గంటలపాటు విచారించి వదిలిపెట్టింది. అనంతరం ఈ నెల 16న మరోమారు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నిన్న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన కవితను రాత్రి 8 గంటల వరకు అధికారులు విచారించారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది.

అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు. అర్ధరాత్రి 12.10 గంటలకు బేగంపేట చేరుకున్న కవిత అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. తండ్రి కేటీఆర్‌ను కలిసి ఈడీ విచారణ జరిగిన తీరును వెల్లడించారు.

Related posts

ఢిల్లీలో ఎంపీ అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయండి…సుబ్రమణ్యస్వామికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం ….

Drukpadam

విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య

Ram Narayana

ఆ వార్తలు నమ్మొద్దు.. ధరలు తగ్గించలేదు: టీటీడీ

Ram Narayana

Leave a Comment