Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలయిక…జానారెడ్డి కీలక వ్యాఖ్యలు…!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై జానారెడ్డి బాంబు …
-కాంగ్రెస్ , బీఆర్ యస్  కలయిక… అవసరమైతే ప్రజలు నిర్ణయిస్తారన్న జానా ..
-బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యం కలవాలంటున్న జానా
-బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామన్న జానారెడ్డి
-పొత్తులపై ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్య
-బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపు

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి బాంబు వేశారు . అవసరమైతే రెండుపార్టీలు కలయిక గురించి ప్రజలు నిర్ణయిస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలసి పని చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. తన కొడుకు వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఈరోజు ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. అందులో భాగంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. ‘‘మోదీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలి’’ అని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కేంద్రం పనిచేస్తోందని, కేంద్ర నియంతృత్వ ధోరణిని ప్రజలకు వివరిస్తామని జానారెడ్డి తెలిపారు. కేంద్రం తీరుపై 17 ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఐక్యతగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి అండగా నిలిచినట్లు చెప్పారు. రాహుల్ కేసులు పెడితే బీజేపీ వాళ్లంతా జైల్లో ఉంటారని హెచ్చరించారు. పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై రాహుల్ గాంధీ మాట్లాడకుండా చేసేందుకే అనర్హత వేటు వేశారన్నారు.

జానారెడ్డి వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు కల్సి పనిచేయాలని చెప్పటం వరకు బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ తో కూడా కలిసి పనిచేస్తామన్నట్లుగా చెప్పడంపై కాంగ్రెస్ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతుందని .జానారెడ్డి లాంటి పెద్దాయన ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ చేస్తున్న ఆరోపణలకు జానారెడ్డి వ్యాఖ్యలు బలం చేరుకుర్చాయని అంటున్నారు .దీనివల్ల కాంగ్రెస్ కు బీఆర్ యస్ కు లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

కేటీఆర్ నాస్తికుడు ముందు ఆయ‌న‌ను మార్చండి : బండి సంజ‌య్!

Drukpadam

27న హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్!

Drukpadam

పాలేరు లో పెరుగుతున్న ఎమ్మెల్యే కందాల గ్రాఫ్ …!

Drukpadam

Leave a Comment