Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీలో బీజేపీ …వైసీపీ మధ్య వార్ మొదలైనట్లేనా …?

ఏపీలో బీజేపీ …వైసీపీ మధ్య వార్ మొదలైనట్లేనా …?
-స్నేహంగా ఉన్నా బీజేపీ …వైకాపాల మధ్య వైరానికి కారణమేమిటి….
-అమిత్ షా ,జెపి నడ్డా పర్యటనలు బీజేపీ ఉపయోగపడతాయా…
-జగన్ ప్రభుత్వం పై ,బీజేపీ విమర్శలు,ప్రతిగా సీఎం జగన్ మాటలు
-మిత్రుల మధ్య దూరం పెంచిందా …
-అమిత్ షా, జేపీ నడ్డాల అవినీతి ఆరోపణలపై విజయసాయిరెడ్డి స్పందన
-అవినీతి ఎక్కడ జరిగిందో ఇద్దరూ చెప్పలేకపోయారన్న విజయసాయి
-కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని వ్యాఖ్య
-ఏ పార్టీతోనూ వైసీపీ పొత్తు పెట్టుకోదని స్పష్టీకరణ

ఏపీ రాజకీయాల్లో ఏమి జరుగుతుంది…? ఎవరితో ఎవరు ఉన్నారు … 2024 లో జరగనున్న ఎన్నికల్లో ఎవరితో ఎవరికీ పొత్తు ఉంటుందనే ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. నిన్నమొన్నటివరకు బీజేపీతో ఎడమొహం ,పెడమొహంగా ఉన్న టీడీపీ, బీజేపీతో పొత్తు కోసం తన శక్తి యుక్తులన్నీ ఉపయోగిస్తుంది. పవన్ కళ్యాణ్ , బీజేపీ , టీడీపీ కలిసి ఎన్నిలకు వెళ్లడం ద్వారా ఏపీలో అధికారం లో ఉన్న జగన్ సర్కార్ ను సాగనంపాలనే పట్టుదలతో ఉన్న బాబు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు . అందులో భాగంగానే ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా , నడ్డలను ఢిల్లీ వెళ్లి కలిశారు . బాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా , జెపి నడ్డల స్వరంలో మార్పు వచ్చింది. ఇప్పటివరకు జగన్ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేయని బీజేపీ ఒక్కసారిగా జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించింది . అవినీతి ఆరోపణలు చేసింది. నిజంగా వారి విమర్శలు జగన్ ను ఇద్దేశించెనా …? లేక ఏపీ బీజేపీ పార్టీ వారిని చల్ల బరిచేందుకా అనే సందేహాలు లేకపోలేదు ..

ఇప్పటివరకు అన్ని సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీకి అండగా ఉన్న ,అధికార వైసీపీ మధ్య వైరం మొదలైంది . వారి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది . దీనివల్ల వల్ల ఎవరికీ లాభం …? ఎవరికీ నష్టం అనే చర్చ జరుగుతుంది . తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విడగొట్టిన కేంద్రం రెండు రాష్ట్రాలమధ్య ఉన్న అనేక సమస్యలకు ఇంతవరకు పరిస్కారం చూపలేదు … పరిష్కరాల పేరుతో జరుపుతున్న సమావేశాలు ఫలితాలు ఇవ్వడంలేదు . అధికారంలో ఉన్న వైసీపీ పై విమర్శలు గుప్పిస్తూనే ఉంది . బీజేపీ చెప్పిన విధంగా వాగ్దానాలు అమలుకు నోచుకోని విషయాలను మాత్రం ఎక్కడ వారు ప్రస్తావించకుండానే వైసీపీ ప్రభుత్వం తప్పులు చేస్తుందని, అవినీతి మయమైందని నిత్యం విమర్శలు చేస్తున్నారు . ఇవి తమ ఉనికి కాపాడుకోవడం కోసమేనా అన్నట్లుగా ఉన్నాయి. రాష్ట్రం సమస్యలు పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయి కదా అని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డలు జగన్ ప్రభుత్వం అవినీతి మయమైందని విమర్శలు గుప్పించారు . ప్రత్యేక ఆరోపణలు చేయకుండా , పెద్ద నాయకులు ఇలా పాసింగ్ రిమార్క్ లు చేయడం బీజేపీకి లాభం కన్నా నష్టమే వస్తుందని పరిశీలకుల అభిప్రాయం . బీజేపీ సిద్ధాంతాలు ఏవైనా ఒక క్రమశిక్షణ గల పార్టీగా పేరుంది . కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఎవరిని పడితే వారిని తమ స్వార్థం కోసం చేరిన నాయకులను మెప్పించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారా …అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. దీంతో వైసీపీ కి మేలు జరుగుతుందని భావన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ వంట గ్యాస్ , పెట్రోల్ ,డీజిల్ ధరలు దగ్గించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రజల మౌలిక సమస్యల పరిష్కరంలో , ధరలను తగ్గించడంలో ,రైట్లులకు గిట్టుబాటు ధరలను కల్పించడంలో విఫలమైన కేంద్ర వైఖరిపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఈనేపథ్యంల్ పల్నాడు పర్యటనలో ఏపీ సీఎం జగన్ కూడ బీజేపీ తమకు అనుకూలంగా ఉంటుందని అనుకోవడం లేదని అన్నారు . ప్రజల అండ ఉండ ఉంటె చాలని అన్నారు . అందువల్ల బీజేపీకి .జగన్ సర్కార్ కు మధ్య స్నేహం చెడిందనే అభిప్రాయాలే కలుగుతున్నాయి.

 

ఏపీ పర్యటనకు వచ్చిన సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి స్పందించారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడూ సమన్వయం ఉంటుందని చెప్పారు.

వైసీపీ పాలనలో అంతులేని అవినీతి జరిగిందని అమిత్ షా, జేపీ నడ్డా ఆరోపణలు చేశారనీ… అయితే, అవినీతి ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేకపోయారని విజయసాయి అన్నారు. ఆడిటింగ్ లో ఏమైనా అవినీతిని గుర్తించారా? అని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా వైసీపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. ఏపీ పరిపాలన రాజధాని విశాఖలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts

వైసీపీ నేత సుబ్బారావు గుప్తా కు నిన్న దెబ్బలు నేడు కేకులు…

Drukpadam

ప్రపంచంలో అత్యంత పురాతనమైన భాషలు ఏంటో తెలుసా…?

Drukpadam

సాగర్ ఎన్నిక మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

Drukpadam

Leave a Comment