Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్తెలంగాణ వార్తలు

కుతుబ్ షాహీపై పడిన పిడుగు.. బీటలు వారిన మినార్

  • నగరంలో పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీరు
  • పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
  • సరూర్ నగర్, మలక్ పేటలలో 5 సెంటీమీటర్ల వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో నగరవాసులను వర్షం వణికించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని మేయర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. నగరంలో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. కాసేపు వర్షం నిలిచినా ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు చేరేందుకు రోడ్లపైకి వచ్చారు. వర్షం నిలిచాక ఒకేసారి అందరు రావడం, అదే సమయంలో రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో నగరంలోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

హైటెక్ సిటీ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాలు నిలిచాయి. చార్మినార్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. మూసారాంబాగ్ బ్రిడ్జిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో గోల్నాక బ్రిడ్జి పై నుండి వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఉప్పల్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, బాలానగర్, ప్రకాశ్ నగర్, ట్యాంక్ బండ్, ఐకియా సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది.

కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లు, రాజేంద్ర నగర్, అంబర్ పేటలలో 4 సెంటీమీటర్లు, గోషా మహల్ లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

Related posts

ఉద్యమం కొనసాగించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయం!

Drukpadam

లోన్ కోసం వెళ్లిన వ్యక్తికి షాక్.. ఒకే పేరుతో 38 అకౌంట్లు!

Drukpadam

ముద్రగడ, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవీలకు ఊరట: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత…

Drukpadam

Leave a Comment