Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆయుష్మాన్ భారత్ లో ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు…

ఆయుష్మాన్ భారత్ లో ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు…
-దేశవ్యాపితంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో ఉచిత వైద్యం
-1000 జబ్బులకు చికిత్స ;ఐదు లక్షలవరకు ఎలాంటి ఫీజు ఉండదు
-ప్రమంచంలోనే అత్యంత పెద్ద ఆరోగ్యపథకం
-తెలంగాణ ప్రభుత్వంతో ఇటీవలనే ఒప్పందం
-ఆధార్ కార్డు తరహాలో హెల్త్ కార్డులు
త్వరలో ప్రజలకు ఆధార్ కార్డు తరహాలో నూతన హెల్త్ కార్డు(ఆయుష్మాన్ భారత్) ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని ఆయుష్మాన్ భారత్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయుష్ భారత్ లో చేరేందుకు ముందు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు . ఆయుష్మాన్ భారత్ పథకంకన్నా తెలంగాణ ప్రభుత్వం అములు చేస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మంచిదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ లో చేరుందుకు ఇష్టపడలేదు . ఇటీవలనే అందులో చేరారు .

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారుచేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో చేరాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సీఈవోకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మెమో జారీ చేశారు.

ఆయుష్మాన్‌ భారత్ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో రాంచీలో లాంఛనంగా ప్రారంభించారు. అయితే, అంతకు ముందు ఆగస్టులోనే హరియాణాలోని కర్నాల్‌లో జన్మించిన కరిష్మా అనే బాలికనుఈ పథకం మొదటి లబ్ధిదారుగా చెబుతారు. ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితం. దీని కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.

Related posts

రాహుల్ గాంధీ.. మాటలు జారొద్దు!: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Drukpadam

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు!

Drukpadam

పంజాబ్ లో జర్నలిస్టులకు సీఎం వరాలు…

Drukpadam

Leave a Comment