- డీకేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
- కేసును కొట్టివేయాలని కోరుతూ డీకే పిటిషన్
- పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో శివకుమార్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. డీకే ఆస్తుల విచారణపై ఉన్న స్టేను ఎత్తివేసింది. అక్రమాస్తుల కేసులో డీకేపై 2020 అక్టోబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: