- అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
- దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు
- దేశంలోని అన్ని జోన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
- జనవరి 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు ప్రత్యేక రైళ్లు
దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యాపురిలో కొలువు దీరిన బాలక్ రామ్ (రామ్ లల్లా)ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని వివిధ జోన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది.
ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు నెలరోజుల పాటు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి జనవరి 29, 31… ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ఒక్కో రైలులో 1400 మంది వెళ్లే వీలుంది. త్వరలోనే ఈ ప్రత్యేక రైళ్లకు నెంబర్లు కేటాయించి, రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.