Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీజేపీ పేపర్ టైగరేనా ?

బీజేపీ నిజంగా పేపర్ టైగరేనా ? తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అంత శక్తి దానికి లేదా? దుబ్బాకలో దాని గెలుపు ప్రత్యేక పరిస్థితుల్లో కాబట్టి సాధ్యమైందా ? గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీకి బలం లేదా ? హిందూ -ముస్లింలను రెచ్చగొట్టటం ద్వారా ఎక్కువ స్థానాలలో గెలుపొంద గలిగిందా ? అనే చర్చ జరుగుతుంది . గ్రేటర్ లో కాంగ్రెస్ ఎలాగూ వచ్చే పరిస్థితి లేనందునే బీజేపీకి కలిసి వచ్చిందనే వాదనలు ఉన్నాయి . తెలంగాణపై దాని ప్రభావం అంతగా ఉండక పోవచ్చునని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి . 2023 తెలంగాణ రాష్ట్ర శానసభ ఎన్నికలలో దాని ప్రభావం ఉండదనే ప్రచారం ఉంది . అందులో వాస్తవమెంత ? అంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , అధిష్టానం ఆమోదిస్తే కాబోయే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీ పార్టీకి అంత సీన్ లేదని అంటున్నారు . కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు ఆపార్టీని ఆదరించబోరని పేర్కొంటున్నారు . బీజేపీ మాత్రం గంపెడు ఆశలతో ఉంది . 2023 ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరటం ఖాయం అంటున్నది . ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం కెసిఆర్ ను గద్దె దించే సత్తా తమకే ఉందంటున్నారు . బీజేపీ కి అంత శక్తి ఉంటె హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో ఎందుకు డిపాజిట్ పోగుట్టుకొన్నారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు . దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల భరిలోనుంచి తప్పుకొన్నారని తప్పుడు ప్రచారం చేయటం తో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటర్లు సైతం ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారనేది కాంగ్రెస్ వాదన . ఇరువురి వాదన ఎలాఉన్నా రాష్ట్రంలో టీ ఆర్ యస్ కు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యాన్మయం అనుకున్న ప్రజలు ప్రస్తుతం బీజేపీనే ప్రత్యాన్మాయం అని నమ్ముతున్నారు . రేవంత్ రెడ్డి అంగీకరించినా , అంగీకరించక పోయినా, టీ ఆర్ యస్ ను ఓడించగల సత్తా ఎవరికీ ఉంటె వారి వైపే మొగ్గుచూపే ఆవకాశాలు ఉన్నాయి . అది , కాంగ్రెస్ కు ఉంటుందా ? లేక బీజేపీకి ఉంటుందా ? అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది . కాంగ్రెస్ కు ఇప్పటికి సరైన నాయకుడు లేడు .భవిష్యత్ లో ఉంటాడో లేదో తెలియదు . ప్రస్తుతం బీజేపీ రాష్ట్రం లో మంచి దూకుడు మీద ఉంది . ప్రత్యేకించి దుబ్బాక ఉపఎన్నిక , గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత టీ ఆర్ యస్ ను ఢీకొట్ట గలిగే శక్తి బీజేపీకి ఉందని ప్రజలు నమ్ముతున్నారు . అందువల్ల బీజేపీ అంటే ఇష్టం లేక పోయినా , టీ ఆర్ యస్ విధానాలపై అసంతృప్తితో ఉన్న ప్రజలు బీజేపీ పార్టీ నే టీ ఆర్ యస్ ను ఓడిస్తున్నదని నమ్మకం కలిగిన తరువాత దానికి ఓటు వేశారు . బీజేపీకి ఓట్లు వేసిన వారంతా బీజేపీ సిద్ధాంతాలు నచ్చి కాదనే విషయం వారు గ్రవించాలి . తెలంగాణాలో చైతన్యవంతమైన ప్రజలు మత రాజకీయాలను అంగీకరించేందుకు ఇష్ట పడక పోవొచ్చు . అయితే వాటినే తెరపైకి తెచ్చేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తున్నది . బండి సంజయ్ తెలంగాణలోనే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పై కూడ కామెంటు చేశారు . బైబెల్ కావాలో , భగవత్ గీత కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు . అంటే మత రాజకీయాలను తెలుగు రాష్ట్రాలలో ప్రవేశపెట్టాలని బీజేపీ చూస్తుందని అర్థం అవుతుంది . రెండు రాష్ట్రాలలో బీజేపీ ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నది . అందుకు అనుగుణంగా ఎత్తులు వేస్తుంది . ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి తప్పుకున్నాడని అపవాదును మూటకట్టు కొన్నది . ఇప్పుడు అక్కడ బీజేపీ లోకి చేరుతున్న నేతలంతా బీజేపీ అంటే ఇష్టం ఉండి కాదని వారు ఉన్న పార్టీ బలహీన పడినందున తప్పని పరిస్థిలో మాత్రమే చేరారు అనేది పచ్చి నిజం . రాజకీయ చదరంగంలో ముందు ముందు బీజేపీ పేపర్ టైగెర్ గానే మిగులుతున్నదా ?లేక పవర్ పుల్ గా మారుతుందా ? అనేది చూడాల్సిందే !!!

Related posts

మేం చర్చలకు రమ్మంటుంటే అంత అలుసా?: మంత్రి బొత్స

Drukpadam

: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

Ram Narayana

తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష కీ విడుదల.. 31న ఉదయం నుంచి అభ్యంతరాల స్వీకరణ..

Drukpadam

Leave a Comment