Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల… !

  • చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కార్యక్రమం
  • హాజరైన పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్
  • వివిధ అంశాలతో కూడిన మేనిఫెస్టో వివరాలను మీడియాకు వివరించిన చంద్రబాబు, పవన్

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మూడు పార్టీలు నేడు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. 

మేనిఫెస్టో విడుదల అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, టీడీపీకి యువగళం పాదయాత్రలో వచ్చిన విజ్ఞప్తులను, జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమంలో వచ్చిన వినతులను క్రోడీకరించి ఈ మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చుతూ, రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా ఈ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… టీడీపీ, జనసేన కలిసి అన్ని విధాలుగా తీవ్ర కసరత్తులు చేసిన పిదప ఈ మేనిఫెస్టో రూపొందించామని వెల్లడించారు. కొంతమేర బీజేపీ సూచనలు తీసుకున్నామని తెలిపారు. ఎందుకంటే కేంద్రంలో ఇప్పటికే ఎన్డీయే పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపొందించినందువల్ల, రాష్ట్రాల స్థాయిలో వారు ఎక్కడా మేనిఫెస్టోలతో అనుసంధానం కాలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

అయితే తమ మేనిఫెస్టోకు ఎన్డీయే నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్న ప్రగాఢ విశ్వాసం ఉందని తెలిపారు. అందుకే బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా మేనిఫెస్టోకు మద్దతు తెలిపేందుకు వచ్చారని వెల్లడించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది… ఈ మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యతను టీడీపీ, జనసేన స్వీకరిస్తాయి అని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచామని వివరించారు.

ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలు…

  • ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500…. 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న మహిళలకు ఆడబిడ్డ పథకం వర్తింపు
  • తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000… ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’
  • ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం
  • డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 
  • దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
  • రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం
  • నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి
  • యువతకు ఐదేళ్లలో వివిధ సెక్టార్లలో 20 లక్షల ఉద్యోగాలు
  • మెగా డీఎస్సీపై తొలి సంతకం
  • ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్
  • బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
  • బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పెన్షన్ 
  • బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం
  • స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ను పునరుద్ధరణ… నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత
  • చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు
  • తక్కువ జనాభా కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న వర్గాలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగం
  • బీసీ కులాల దామాషా ప్రకారం వారి ఆర్థికస్థాయిని బట్టి జన గణన… దాని ప్రకారం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు
  • బీసీలకు స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు… ఆదరణ కింద రూ.5 వేల కోట్ల ఆధునిక పనిముట్ల అందజేత
  • యాదవులు అధికంగా ఆధారపడే పాడి పరిశ్రమకు బీమా సౌకర్యం… అధిక రుణాలతో ఆధునికీకరణలో భాగస్వామ్యం
  • గొర్రెల పెంపకంపై ఆధారపడిన కురుబ వర్గం సాధికారతకు చర్యలు
  • చేనేత పరిశ్రమలో ఇబ్బందుల్లో ఉన్నవారికి పవర్ లూమ్ వారికి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్ వారికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం… ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల సాయం
  • దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం… వారి షాపులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితం
  • గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్
  • వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్… రాయల్టీ, సీనరేజి చార్జీల్లో మినహాయింపు
  • రజకులకు ఉపయోగపడేలా దోబీ ఘాట్ ల నిర్మాణం… 200 యూనిట్ల విద్యుత్ ఉచితం 
  • ప్రతి ఇంటికీ ఉచితంగా కుళాయి కనెక్షన్
  • సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం
  • జీవో.217 రద్దు 
  • మత్స్యకారుల బోట్ల మరమ్మతులకు, కొత్త బోట్ల కొనుగోలుకు, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలకు ఆర్థిక సాయం
  • చిన్న స్థాయి పోర్టులకు చేయూత
  • స్వర్ణకారుల కోసం కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు
  • ఆర్యవైశ్య కార్పొరేషన్ కు తగు మేర నిధుల కేటాయింపు
  • చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాలు
  • స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాల నిర్వహణకు పటిష్ట చర్యలు
  • వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహణ
  • ఆక్వా రంగానికి సంబంధించి అవసరమైన ప్రాంతాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు
  • అన్ని ఆక్వా జోన్లలో ఉండేవారికి గతంలో మాదిరే విద్యుత్ ను యూనిట్ కు రూ.1.50 చొప్పున సరఫరా
  • ట్రాన్స్ ఫార్మర్ల ధర తగ్గింపు… ఏవియేటర్లపై సబ్సిడీలు
  • సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన, సరళీకృత ఇసుక విధానం
  • విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు గతంలో మాదిరిగా ఫీజు రీయింబర్స్ మెంట్
  • కాలేజీలకు రుసుం చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్లు వచ్చేలా చర్యలు
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 
  • రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన
  • చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల సబ్సిడీ
  • ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు… అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో ప్రాధాన్యం
  • ఎంఎస్ఎంఈ రంగానికి అధిక ప్రోత్సాహం… పరిశ్రమలకు అనుకూలంగా పాలసీల రూపకల్పన
  • భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణతో రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాల కల్పన
  • యువతలో దృఢ వైఖరి, ఆశావహ దృక్పథం పెంపొందించేందుకు క్రీడల్లో ప్రోత్సాహం
  • ఎక్కడిక్కడ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు
  • అంగన్వాడీ కార్యకర్తలకు చేయూత
  • ఉద్యోగాలు చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు 
  • మధ్యలోనే చదువు ఆపేసిన అమ్మాయిలు చదువు కొనసాగించేందుకు చర్యలు… కలలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలు… వారు స్థిరపడిన తర్వాత వడ్డీ లేకుండా ఆ రుణం చెల్లించేలా ప్రణాళిక
  • ఉద్యోగుల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పీఆర్సీ అమలు… పీఆర్సీ వచ్చేలోపు మధ్యంతర ఊరట కలిగించే చర్యలు… దశల వారీగా బకాయిల చెల్లింపు
  • ఉద్యోగులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రతి నెలా జీతాలు
  • సీపీఎస్ పై అధ్యయనం చేసి సమస్య పరిష్కారానికి కృషి 
  • తక్కువ జీతాలు పొందే అవుట్ సోర్సింగ్  సిబ్బంది, అంగన్వాడీలు, పోలీస్ సిబ్బంది కోసం మెరుగైన చర్యలు
  • వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపు
  • కాపు సంక్షేమం కోసం రూ.15 వేల కోట్ల వ్యయం
  • ఈబీసీ రిజర్వేషన్లలో ప్రాధాన్యత… ఐదేళ్లకు ఓసారి సమీక్ష… ఆర్థిక సర్వే నిర్వహణ
  • కాపు యువత, మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధికి ప్రాధాన్యత… ప్రత్యేక భవనాల నిర్మాణం
  • ఆర్యవైశ్యులు, క్షత్రియులు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేసేందుకు చర్యలు
  • రూ.4 వేల పెన్షన్లను 2024 ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తూ పంపిణీ
  • దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు… పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.10 వేలు
  • కిడ్నీ వ్యాధులు, తలసేమియా బాధితులకు నెలకు రూ.10 వేల పెన్షన్
  • పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం… గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం 
  • ఇప్పటికే పట్టాలు మంజూరైన వారికి ఇళ్ల నిర్మాణం… ఏ స్థలానికి పట్టా వచ్చిందో అదే చోట ఇంటి నిర్మాణం
  • ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ వెంటనే టిడ్కో ఇళ్ల మంజూరు
  • ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి చర్యలు… జిల్లాల వారీగా వర్గీకరణ
  • ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు
  • ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే కేటాయింపు
  • జీవో నెం.3 పునరుద్ధరణ… ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం 
  • ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
  • ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్లు… ఈద్గాలు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు
  • విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం
  • నూర్ బాషా కార్పొరేషన్ కు ఏటా రూ.100 కోట్లు కేటాయింపు
  • మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
  • ఇమామ్, మౌజన్లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవవేతనాలు
  • అర్హత ఉన్న ఇమామ్ లను ప్రభుత్వ ఖ్వాజీలుగా నియామకం
  • మసీదుల నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థికసాయం 
  • హజ్ యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.1 లక్ష ఆర్థికసాయం
  • క్రైస్తవుల సంక్షేమం కోసం తగిన చర్యలు
  • క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు
  • చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థికసాయం
  • క్రైస్తవ శ్మశాన వాటికలకు స్థలం కేటాయింపు
  • జెరూసలెం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు సాయం
  • రైతులకు 9 గంటలు అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా
  • ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
  • డ్రిప్ ఇరిగేషన్ కు 90 శాతం సబ్సిడీ
  • వ్యవసాయ పనిముట్ల కొనుగోలకు సబ్సిడీ
  • సోలార్ పంపు సెట్లకు రాయితీ… మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు
  • ప్రతి కుటుంబానికి రూ.25 ఆరోగ్య లక్షల బీమా… ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు
  • చంద్రన్న బీమా పథకం… సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా
  • విద్యుత్ చార్జీల తగ్గింపు
  • పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి
  • రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
  • బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థికసాయం 
  • జీవో నెం.21 రద్దు చేసి ఫైన్ ల భారం తగ్గింపు
  • అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపు
  • భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరణ
  • మద్యం ధరల నియంత్రణ, పెట్రోల్, డీజిల్ ధరల  నియంత్రణకు చర్యలు 
  • ఉచిత ఇసుక విధానం అమలు
  • రాష్ట్రంలో చాలా స్కూళ్లు మూతపడేందుకు కారణమైన జీవో నెం.117 రద్దు
  • డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

Related posts

విశాఖ ఉత్తర అసెంబ్లీ బరిలో వీవీ లక్ష్మీనారాయణ…

Ram Narayana

సిట్ కార్యాలయానికి లోకేశ్, భువనేశ్వరి, నందమూరి రామకృష్ణ

Ram Narayana

బీజేపీ నుంచి ఫోన్ వచ్చింది… అందుకే…!: కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment