ఖమ్మంలో బీఆర్ యస్ షాక్ …20 డివిజన్ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి గుడ్ బై
భర్త జస్వంత్ తోపాటు 20 ,21 డివిజన్ల బీఆర్ యస్ కమిటీ సభ్యులు కూడా రాజీనామా
జిల్లా అధ్యక్షుడు తాతా మధుకు రాజీనామా లేఖ
9 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేశానని వెల్లడి
అవమానాలు భరించలేకనే పార్టీ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటన
ఖమ్మంలో బీఆర్ యస్ కు షాక్ తగిలింది …20 వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి ఆపార్టీకి గుడ్ బై చెప్పారు …పార్టీలో తమకు అవమానం జరిగిందని అందువల్లనే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …ఆమేతోపాటు బీఆర్ యస్ కీలక నేతగా ఉన్న జస్వంత్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …ప్రశాంతి లక్ష్మి గత రెండు టర్మ్ లుగా కార్పొరేటర్ గా ఆప్రాంత ప్రజలకు సేవలందించారు … భర్త బిక్కసాని జస్వంత్ ఆప్రాంతంలో బీఆర్ యస్ కు కీలక నేతగా వ్యవహరిస్తున్నారు … ఎన్నికలకు ఒకరోజు ముందు కార్పొరేటర్ పార్టీకి రాజీనామా చేయడం బీఆర్ యస్ మైనస్ గా మారె అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి…బిక్కసాని జస్వంత్ కు మాజీమంత్రి పువ్వాడ అజయ్ ఫోన్ చేసి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వరించినట్లు సమాచారం …అయితే అప్పటికే వారి రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుకు పంపారు …బిక్కసాని కుటుంబంతోపాటు 20 ,21 డివిజన్లకు చెందిన కమిటీ సభ్యులు కూడా రాజీనామా చేసినట్లు ఆలేఖలో పేర్కొన్నారు …ఈ విషయమై వారి కుటుంబసభ్యులను సంప్రదించగా తమను అవమానించే విధంగా పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మాట్లాడారని అందుకే మనస్తాపంతో రాజీనామా చేయడం జరిగిందని అన్నారు …అయితే ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్లే ఉద్దేశంలేదని పేర్కొన్నారు …గతంలోగాని, నిన్నటివరకుగాని స్థానికంగా అవసరమైన ఎన్నికల ఖర్చులను తామే భరించామని తెలిపారు …పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమను అవమానించడం ఏమిటని అదే నచ్చకనే పార్టీకి బై చెప్పినట్లు పేర్కొన్నారు …