Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సీటీ స్కాన్, టిఫా సేవలు వెంటనే పునరుద్దరణ చేయాలి – CPM

సీటీ స్కాన్, టిఫా సేవలు వెంటనే పునరుద్దరణ చేయాలి – CPM

ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో పేద, మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించే సీటీ స్కాన్, మరియు టిఫా సేవలను వెంటనే పునరుద్దరణ చేయాలి అని డిమాండ్ చేస్తూ శనివారం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ L.కిరణ్ కుమార్ కు CPM పార్టీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు ‌. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్ మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా సీటీ స్కాన్ సేవలు నిలిచిపోయాయి అని, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు సేవలు అందించే సీటీ స్కాన్ ను వెంటనే అందుబాటులో తేవాలని డిమాండ్ చేశారు.ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పక్షవాతం బాధితులకు, ఇతర వ్యాధులకు అత్యవసరమైన సీటీ స్కాన్ నిలిచిపోవడంతో ప్రయివేటు ఆసుపత్రికి వెళ్ళడం వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. మహిళలకు ఉపయెగపడే టిఫా స్కానింగ్ మిషన్ పనిచేయడం లేదు అని, 30 లక్షలు ఖర్చు పెట్టినా ఉపయెగం లేకపోవడంతో మహిళలు బయట ప్రయివేటు ఆసుపత్రిలో డబ్బులు పెట్టి స్కానింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పారు. సీటీ స్కాన్ కు, టిఫా స్కానింగ్ కు ఒక్కొక్కరికి మూడు వేలు పైగా ఖర్చు పెడుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. గత కాలంగా త్రాగునీటి సౌకర్యం సరిగా లేదు అని వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గుండె సంభవించి వెంటనే ఒక పర్మనెంట్ డాక్టర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు రమేష్, భద్రం, ఉపేంద్ర, సాగర్, నాగరాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Related posts

పెద్ద అధికారుల కనుసన్నల్లోనే అక్రమార్కులకు రెగ్యులైరైజేషన్

Ram Narayana

ఎన్నికల షడ్యూల్ కు ముందే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్లస్థలు ఇవ్వాలి …

Ram Narayana

కాంగ్రెస్ ను తరమాలి…పక్కా లోకలైన నామను గెలిపించుకోవాలి

Ram Narayana

Leave a Comment