- బడాబాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు పబ్‌లలో హంగామా చేస్తున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు
- జూబ్లీహిల్స్‌లో 55 నుండి 60 పబ్‌లు ఉన్నాయని వ్యాఖ్య
- పబ్‌లకు సంబంధించి కొన్ని నిబంధనలు పెట్టాలని, పబ్‌ల బయట డ్రైవ్‌లు పెట్టి ప్రమాదాలు నివారించాలని సూచన
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బడా బాబులకు చురకలు అంటే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంపై హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది.
‘జూబ్లీహిల్స్‌లో 55 నుంచి 60 పబ్‌లు ఉన్నాయి. రోడ్ నెంబర్ 12, రోడ్ నెం.36లో రోజుకో ప్రమాదం జరుగుతోంది. బడాబాబులు సంపాదిస్తుంటే వారి పిల్లలు పబ్‌లలో హంగామా చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు’ అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పబ్‌లకు సంబంధించి కొన్ని నిబంధనలు విధించాలని, పబ్‌ల బయట డ్రైవ్‌లు నిర్వహిస్తూ ప్రమాదాలు నివారించాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు సూచించింది.