ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

  • సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
  • కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన అధినేత
  • జన నాయకుడు కేంద్రం ప్రారంభించి, పనితీరుపై పరిశీలన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. 

కుప్పం ప్రజలు తమ సమస్యలపై జన నాయకుడు కేంద్రంలో వినతిపత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారు. 

నేడు ఈ జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు… పనితీరును పరిశీలించారు. జన నాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా, త్వరలో రాష్ట్రవ్యాప్తం చేయనున్నారు.

Related posts

బలం లేకున్నా పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్!

Ram Narayana

అంబటి ఇంటికి ముద్రగడ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు…

Ram Narayana

అప్పుడు మా వాళ్లు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండదు: జగన్

Ram Narayana