Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

  • సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
  • కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన అధినేత
  • జన నాయకుడు కేంద్రం ప్రారంభించి, పనితీరుపై పరిశీలన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించారు. 

కుప్పం ప్రజలు తమ సమస్యలపై జన నాయకుడు కేంద్రంలో వినతిపత్రాలు అందించవచ్చు. ఈ కేంద్రంలోని సిబ్బంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యాక ఆ వివరాలను ఆన్ లైన్ లో పొందుపరుస్తారు. 

నేడు ఈ జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు… పనితీరును పరిశీలించారు. జన నాయకుడు కేంద్రం ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో అమలు చేస్తున్నారు. దీని పనితీరు ఆధారంగా, త్వరలో రాష్ట్రవ్యాప్తం చేయనున్నారు.

Related posts

చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయితే టీడీపీ నేతలు ఒక విప్లవకారుడిలా బిల్డప్ ఇస్తున్నారు: సజ్జల

Ram Narayana

జగన్-అదానీ వ్యవహారంలో షర్మిల వ్యాఖ్యలకు రోజా కౌంటర్!

Ram Narayana

ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ…!

Ram Narayana

Leave a Comment