ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రేపు పరిటాల సునీత నియోజకవర్గానికి వెళుతున్న జగన్!

  • ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య
  • లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
  • అనంతరం బెంగళూరుకు తిరుగు పయనం

వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. 

రేపు ఉదయం 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళతారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన తిరిగి చెన్నేకొత్తపల్లికి చేరుకుని… అక్కడి నుంచి హెలికాప్టర్ లో బెంగళూరుకు బయల్దేరుతారు. ఇటీవల లింగమయ్య హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఆయనను దారణంగా హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. 

Related posts

మనపాలనలో ప్రజలకోసం చేశాను …ఇక కార్యకర్తలకు అండగా ఉంటాను …జగన్

Ram Narayana

టీడీపీ ,జనసేన పొత్తుల కసరత్తు ….పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు …

Ram Narayana

చిరు నోట తొలిసారి జై జ‌న‌సేన‌.. చాలా రోజుల త‌ర్వాత‌ ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌స్తావ‌న‌!

Ram Narayana