సోలార్ డిఫెన్స్, ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ‘భార్గవాస్త్ర’ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పొరుగు దేశం పాకిస్థాన్ ఎక్కువగా డ్రోన్లతో దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ‘భార్గవాస్త్ర’ ను సిద్ధం చేసింది. సోలార్ డిఫెన్స్, ఏరోస్పేస్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్‌ను భారత్ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని గోపాల్పూర్ లో గల సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించింది. మూడుసార్లు పరీక్షించగా.. భార్గవాస్త్ర రాకెట్ టార్గెట్‌ను కచ్చితత్వంతో హిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భార్గవాస్త్ర డ్రోన్ సమూహాల ముప్పును ఎదుర్కోవడంలో చాలా కీలకం.
previous post