జాతీయ వార్తలు

డ్రోన్‌ దాడులకు కౌంటర్‌గా.. భార్గవాస్త్రను పరీక్షించిన భారత్‌

సోలార్‌ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (SDAL‌) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పొరుగు దేశం పాకిస్థాన్‌ ఎక్కువగా డ్రోన్లతో దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రోన్‌ దాడులను ఎదుర్కొనేందుకు భారత్‌ కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌  ‘భార్గవాస్త్ర’ ను సిద్ధం చేసింది. సోలార్‌ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సిస్టమ్‌ను భారత్‌ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌ లో గల సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి పరీక్షించింది. మూడుసార్లు పరీక్షించగా.. భార్గవాస్త్ర రాకెట్‌ టార్గెట్‌ను కచ్చితత్వంతో హిట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భార్గవాస్త్ర డ్రోన్‌ సమూహాల ముప్పును ఎదుర్కోవడంలో చాలా కీలకం.

Related posts

ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. చమోలీలో జల విలయం.. బాలిక మృతి

Ram Narayana

భారత్‌లో దారుణంగా వాయు కాలుష్యం.. ఒక్క ఏడాదే 17 లక్షల మంది బలి!

Ram Narayana

హత్య కేసులో జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి‌ బీహార్ ఎలక్షన్స్ లో విజయం.

Ram Narayana