తెలంగాణ వార్తలు

బ‌స్‌పాస్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ.. నేటి నుంచే అమ‌ల్లోకి

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ర‌కాల బ‌స్‌పాస్ ఛార్జీలు పెరిగాయి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు స్టూడెంట్ బ‌స్ పాస్ ధ‌ర‌ల‌ను పెంచింది టీజీఎస్ ఆర్టీసీ. పెంచిన బ‌స్ పాస్ ధ‌ర‌లు నేటి నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. 20 శాతానికి పైగా బ‌స్ పాస్ రేట్లు పెరిగాయి. రూ. 1150 ఉన్న ఆర్డిన‌రీ పాస్ ధ‌ర రూ. 1400కు పెంపు, రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600, రూ. 1450 ఉన్న మెట్రో డీల‌క్స్ పాస్ రూ. 1800కు పెంచారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధ‌ర‌ల‌ను పెంచారు. సాధార‌ణ ఛార్జీల‌తో పాటు బ‌స్ పాస్ ఛార్జీలను పెంచ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై పురుష ప్ర‌యాణికులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. మ‌హిళ‌ల‌కు ఫ్రీ జ‌ర్నీ సౌక‌ర్యం క‌ల్పించి, మ‌గాళ్ల‌పై ఛార్జీల బాదుడు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రేవంత్ స‌ర్కార్‌కు నూక‌లు చెల్లిన‌ట్లే అని ప్ర‌యాణికులు మండిప‌డుతున్నారు.

Related posts

స్మగ్లింగ్ చేసే హీరోకు జాతీయ అవార్డులా?: పుష్ప సినిమాపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం!

Ram Narayana

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!

Ram Narayana

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ అరెస్ట్… తీవ్రంగా స్పందించిన కేటీఆర్

Ram Narayana