సినిమా వార్తలు

కోట శ్రీనివాసరావు ఇప్పుడెలా ఉన్నారో చూశారా?

  • కొంతకాలంగా సినిమాలకు దూరంగా కోట శ్రీనివాసరావు
  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కోట
  • కోటను కలిసిన బండ్ల గణేశ్

తెలుగు సినీ యవనికపై తనదైన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1947 జులై 10న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన ఆయన, నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన సినీ ప్రస్థానంలో తెలుగు సినిమాతో పాటు భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు. ఇటీవల కొంతకాలంగా ఆయన సినిమాల్లో కనిపించడంలేదు. 82 ఏళ్ల కోట వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా కోట శ్రీనివాసరావును ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కలిశారు. కోట బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కోటతో కలిసున్న ఫొటోను కూడా బండ్ల గణేశ్ పంచుకున్నారు. అయితే, ఆ ఫొటో చూస్తే… కోట ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఓ కాలికి బ్యాండేజి, మరో కాలికి నయనమైన గాయాల ఆనవాళ్లతో, బాగా బలహీనంగా కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటను ఇలా చూసిన అభిమానులు బాధపడుతున్నారు. 

Related posts

ఇంకెప్పుడూ ఇలా మాట్లాడను: నటుడు రాజేంద్రప్రసాద్

Ram Narayana

 ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత

Ram Narayana

సోనియా గాంధీని కించపరిస్తే బట్టలూడదీసి కొడతాం.. ఆర్జీవికి కాంగ్రెస్ నేతల వార్నింగ్…

Drukpadam