ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

పల్నాడు పర్యటనలో కూటమి సర్కార్ పై జగన్ ఫైర్ …

కూటమి గెలిచాక వారిని ఊరు విడిచి వెళ్లిపోమన్నారు

  • పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మాజీ సీఎం జగన్ పర్యటన
  • ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ
  • ఏపీలో అభివృద్ధి, సంక్షేమం లేవని, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని విమర్శ
  • నాగమల్లేశ్వరరావును బెదిరించిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు పర్యటనలో పాల్గొన్నారు ..టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగాయని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లెక్కింపు తర్వాత సి ఐ వేధింపులకు తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు …ఆ సి ఐ పై చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోక పోవడాన్ని ఆయన తప్పు పట్టారు ..

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలం, రెంటపాళ్ల గ్రామానికి చెందిన కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే దీనికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన రెంటపాళ్లలో పర్యటించి, ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు.

“పోలీసు వేధింపులతోనే ఆత్మహత్య”

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజున రెంటపాళ్ల ఉపసర్పంచ్‌గా ఉన్న నాగమల్లేశ్వరరావుపై తెలుగుదేశం, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేశారని జగన్ ఆరోపించారు. ఆ ఆరోపణలతో పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా అవమానించారని అన్నారు. ఎన్నికల్లో కూటమికి అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడులు చేసి, ఊరు విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే రౌడీ షీట్ తెరుస్తామని స్వయంగా సీఐ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

“జూన్ 5వ తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును వదిలిపెట్టగా, ఆయన నేరుగా గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి, పోలీసులు తనను బెదిరించిన తీరును వివరించారు. పోలీసుల వేధింపుల వల్లే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తండ్రి ఎంత ప్రయత్నించినా కుమారుడిని కాపాడుకోలేకపోయారు” అని జగన్ ఆవేదనగా చెప్పారు.

“రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది”

రాష్ట్రంలో అభివృద్ధి గానీ, సంక్షేమం గానీ కనిపించడం లేదని, కేవలం ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ మాత్రమే అమలవుతోందని జగన్ విమర్శించారు. “రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయనడానికి ఈ ఆంక్షలే నిదర్శనం. ఎన్నికల ఫలితాల సమయంలో తమకు అనుకూలమైన పోలీసు అధికారులను నియమించుకుని, కూటమిని గెలిపించుకోవడానికి అనేక అన్యాయాలకు పాల్పడ్డారు. ఈ విషయం ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు” అని అన్నారు.

నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయన తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. “నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భార్య, కుమార్తె ఉన్న నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఘటన జరిగి ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది” అని జగన్ ప్రశ్నించారు.

ఇదే నియోజకవర్గంలో లక్ష్మీనారాయణ అనే మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కూడా పోలీసుల వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని, ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య ఉన్నాడని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ కాన్వాయ్ లో కారు ఢీ కొని వృద్ధుడు మృతి


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు మరణించాడు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించేందుకు వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం భారీ కాన్వాయ్ తో తాడేపల్లి నుంచి బయలుదేరారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు వాహనాల ర్యాలీ నిర్వహించారు.

ఈ క్రమంలో ఏటుకూరు బైపాస్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది. దీంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించాడని వైద్యులు తెలిపారు. కాగా, వృద్ధుడిని ఢీ కొట్టినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో వైసీపీ నేతలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ పర్యటన… మరో వ్యక్తి మృతి

Jagans Palnadu Tour Two People Died in Separate Incidents
  • పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనలో ఇద్దరి మృతి
  • ఏటుకూరు వద్ద కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు సింగయ్య మరణం
  • సత్తెనపల్లిలో తోపులాటలో ఊపిరాడక జయవర్ధన్ రెడ్డి మృతి

వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో తీవ్ర విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పర్యటనలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం జగన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఏటుకూరు బైపాస్ వద్ద సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. 

మరో ఘటనలో, సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహం, తోపులాటలో వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి (ఆటోమొబైల్ షాపు నిర్వాహకుడు) ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Related posts

పెనమలూరులో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు నాదే: జోగి రమేశ్

Ram Narayana

గేర్ మార్చిన జగన్ … వైసీపీలో చేరనున్న రాజకీయ ఉద్దండుడు ఉండవల్లి!

Ram Narayana

నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం!

Ram Narayana