క్రికెట్ వార్తలు

గిల్ తొలి డబుల్ సెంచరీ… భారత్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 587

గిల్ తొలి డబుల్ సెంచరీ… భారత్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 587
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా పటిష్ఠ స్థితి
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీ
269 పరుగులతో వద్ద గిల్ అవుట్
జడేజా (89), జైస్వాల్ (87) కీలక అర్ధశతకాలు
రెండో రోజు ఆటలో 587 పరుగులకు ఇండియా ఆల్ ఆవుట్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

బర్మింగ్‌హామ్ లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. యువ ఆటగాడు గిల్ కు కెరీర్ లో ఇదే తొలి డబుల్ సెంచరీ. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు 587 పరుగులకు ఇండియా ఆల్ అవుట్ అయింది …

టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుండి జట్టును నడిపించాడు. ఓపికగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గిల్, 340 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సర్లతో 269 పరుగులు చేసి అవుట్ అయ్యాడు . అతనికి రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) చక్కటి సహకారం అందించారు. వీరిద్దరూ కీలక అర్ధశతకాలతో జట్టు స్కోరును పెంచడంలో కీలక పాత్ర పోషించారు.

ఆరంభంలో కేఎల్ రాహుల్ (2) వికెట్‌ను త్వరగానే కోల్పోయినా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడారు. జైస్వాల్, జడేజా ఔటైన తర్వాత, గిల్.. వాషింగ్టన్ సుందర్‌ (26*)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్ తలో వికెట్ తీశారు. భారీ స్కోరు సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌పై పట్టు బిగించింది.

Related posts

సూర్య పట్టిన క్యాచ్ పై దక్షిణాఫ్రికా ఫ్యాన్స్ వంకరబుద్ధి …

Ram Narayana

ఆరేళ్ల తర్వాత మళ్లీ క్యాబ్ అధ్యక్షుడుగా ఎన్నికైన సౌరభ్ గంగూలీ!

Ram Narayana

రెండవ టెస్ట్ లోను టీం ఇండియా తడబాటు …

Ram Narayana