తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం మీడియా సమావేశంలో తిట్ల దండకంతో సీఎం రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేటీఆర్!

శుక్రవారం మాజీ మంత్రి ,బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శల పేరుతో జిల్లాకు వచ్చారు ..ఖమ్మంలో మొదట కార్యకర్తల సమావేశంలోనూ , అనంతరం జిల్లా బీఆర్ యస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు … రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తిట్ల దండకం అందుకున్నారు …అరగంటకు పైగా నాన్ స్టాప్ ఉపన్యాసం చెప్పారు …చివరకు మీడియా ప్రశ్నలకు ఛాన్స్ ఇవ్వకుండానే లేచిపోయారు …ఇక పేరుకు మీడియా సమావేశమే అయిన చిన్నదిగా ఉన్న మీడియా సమావేశంలోకి కార్యకర్తలు సైతం తోసుకొని వచ్చారు…ఒక సందర్భంలో తోపులాట జరిగింది ..సమావేశం హాల్ లో ఏర్పాటు చేసిన పార్టిషన్ విరిగి పోతుందా అన్నట్లుగా ఒకరిపై మరొకరు నెట్టుకున్నారు …చివరకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోక్యం చేసుకొని అల్లరి చేయవద్దని హెచ్చరించారు …తరువాత కేటీఆర్ కూడా నిశ్శబ్దంగా ఉండండి అని అప్పీల్ చేయాల్సి వచ్చింది … మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు చెప్పిన కేటీఆర్ తిట్లదండకంతో స్పీడ్ పెంచారు …జెట్ స్పీడ్ తో నాన్ స్టాప్ గా తిట్టిన తిట్టు తిట్టకుండా పంచులు ,సవాళ్లు విసురుతూనే రెచ్చిపోయారు …

ఏపీ మంత్రి లోకేశ్‌ ను కేటీఆర్ రహస్యంగా కలిశాడంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

లోకేశ్ నీలాగా చదువు లేని వాడు కాదు… లోకేశ్ పక్క రాష్ట్ర మంత్రి.. తమ్ముడి లాంటి వారన్న
నాపై చేసే ఆరోపణలకు ఆధారాలు బయటపెట్టాలి ..రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లాభం లేదు ..
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తనకు మంచి మిత్రుడు అని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను లోకేశ్‌ను కలిశానని చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ కలిసినా తప్పేమిటని ప్రశ్నించారు. లోకేశ్ పక్క రాష్ట్ర మంత్రి , తమ్ముడి లాంటి వాడని అన్నారు.

“నేనేదో లోకేశ్‌ను అర్ధరాత్రి కలిశానట. నేను ఏం చేసినా బాజాప్తా చేస్తాను. అయినా లోకేశ్ నీలాగ ఏమైనా అంతర్రాష్ట్ర దొంగనా? లోకేశ్ ఏమైనా నీలాగా సంచులు మోసిన వ్యక్తా? లోకేశ్ నీలా చదువు రాని వాడు కాదు కదా” అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “లోకేశ్ మీ పెద్ద బాస్ చంద్రబాబు కొడుకే కదా.. నేనేదో గూండానో, దావూద్ ఇబ్రహీంనో చీకట్లో కలిసినట్లు డైలాగ్‌లు ఏందిరా హౌలా?” అంటూ దుయ్యబట్టారు.

నేను దొంగనేమీ కలవలేదని, అయినా నీలా ఢిల్లీలో లోఫర్ రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. చీకట్లో వెళ్లి అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నానా, మోదీకి ప్రణమిల్లుతున్నానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పాలన గురించి తెలుసుకోవాలంటే బీఆర్ఎస్‌ను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే మాత్రం మీ వద్దకు రావాలని ఎద్దేవా చేశారు.

ఒకాయన కమిషన్ల మంత్రి ,మరొకాయన బాంబుల మంత్రి ,ఇంకొకాయన రైతులకు మేలుచేయన మంత్రి అని అంటూ విమర్శలు గుప్పించారు …పొంగులేటి కొడంగల్ లో 4 వేల కోట్లు వర్కులు ఇచ్చారు … పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్ జరిగింది …ఏడాది అయినా ఏమి జరగలేదు …ఇది కాంగ్రెస్ ,బీజేపీ బంధం …దీన్ని గురించి ఎందుకు రాయరు అని కేటీఆర్ ప్రశ్నించారు …

డిప్యూటీ సీఎం భట్టి ,రెవెన్యూ మంత్రి పొంగులేటి , నీటి పారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ఫోన్ ట్యాపింగ్ చేయడంలేదా…చెప్పు నీ మనవడి మీద ఒట్టేసి అని అన్నారు .. నీ కుర్చీ కోసం అడ్డమైన నికృష్ట రాజకీయాలు …ఇప్పటికే 49 సార్లు ఢిల్లీకి , ఎందుకు మోడీ ,అమిత్ షా కాళ్ళ మీద పడేందుకేనా …?

తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని, చివరకి గుండు సూదంత ఆధారం కూడా చూపలేకపోయారని విమర్శించారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకు సంబంధం అంటగట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ధైర్యం ఉంటే, ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఎన్నో నిరాధార ఆరోపణలు చేశారని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని కేటీఆర్ అన్నారు. తాను ఏం పని చేసినా బాహాటంగానే చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గత 20 నెలల కాలంలో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్ప, రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. తన విషయానికి వచ్చేసరికి ఒకసారి డ్రగ్స్ అంటారని, మరోసారి కారు రేసింగ్ అంటారని ఆయన మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న నిరాధార వ్యాఖ్యల వల్ల యూట్యూబర్లకు తప్ప ఎవరికీ లాభం లేదని కేటీఆర్ అన్నారు. ప్రజలు గాసిప్స్ మాయలో పడి ఆరు గ్యారెంటీలను మరిచిపోతున్నారని ఆయన అన్నారు. బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన భేటీలో బనకచర్ల అంశం ప్రస్తావనకు రాలేదని ముఖ్యమంత్రి అబద్ధం చెప్పారని ఆయన అన్నారు. అంతేకాకుండా, చంద్రబాబుతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 420 హామీలపై కాంగ్రెస్ పార్టీతో ఫుట్‌‍బాల్ ఆడటం ఖాయమని ఆయన హెచ్చరించారు.

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదన్నారు ..42శాతం రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ పేరుతో బీసీలను దారుణంగా మోసం చేశావు …ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు ఆగం అవుతుంటే.. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు ..ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు వంద సీట్లు ఖాయమన్నారు .. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం కావడం ఖాయమన్నారు … మీడియా సమావేశంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ , మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య,కొండబాల కోటేశ్వరరావు ,మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ,డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు ..

ఖమ్మం పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి బీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిపిఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు ను ఆయన నివాసంలో కలిశారు …ఈసందర్భంగా పువ్వాడ ఆరోగ్య పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు ..పువ్వాడ కుటుంబసభ్యులు మమతా మెడికల్ కాలేజీ కరెస్పాండంట్ పువ్వాడ జయశ్రీ కుమారుడు ,కోడలు ,పువ్వాడ సతీమణి విజయలక్ష్మి లను కేటీఆర్ కలిశారు …వారి యోగక్షేమాలు గురించి తెలుసుకున్నారు .

Related posts

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు

Ram Narayana

బీఆర్ యస్ కు తుమ్మల గుడ్ బై …?

Ram Narayana

పార్టీ మారుతున్నారనే ప్రచారంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందన!

Ram Narayana