రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శలకు తుమ్మల స్ట్రాంగ్ డోస్…
భాష మార్చుకో లేకపోతె ప్రజలు మరోసారి బుద్ది చెపుతారని హితవు
4 కోట్ల మంది ప్రజలు ప్రజలు పీకేసినోళ్లు పీకుతామంటే అపహాస్యం గా ఉందన్న తుమ్మల
ఇంట్లో సరిచేసుకొని సన్నాసులకు దేశ రాజకీయాలా …?
పిచ్చి మాటలు ,రోతమాటలు మాట్లాడి రాజకీయాలను దిగజార్చవద్దు

కేటీఆర్ ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా మంత్రులపైనా చేసిన తిట్లదండకానికి మంత్రి తుమ్మల గట్టి కౌంటర్ ఇచ్చారు .. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ నోరుందికదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరాని విషయాన్నీ గుర్తుపెట్టుకోవాలి హెచ్చరించారు .. ముఖ్యమంత్రి మీద మాట్లాడే భాషనే అది ఏమిటి ప్రజలు నువ్వు ఇచ్చే సందేశం అని నిలదీశారు .. మాట్లాడేముందు మీ నాన్న గారినీ అడిగి అభివృద్ధి పై మాట్లాడాలని హితవు పలికారు ..ప్రజలు పీకేసినోళ్లు పీకుతామంటే అపహాస్యం గా ఉందని చురకలు అంటించారు ..మీ అహంకారం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారు.. సీతారామ ప్రాజెక్ట్ రోళ్లపాడు లో కేసీఆర్ శంకుస్థాపన చేస్తే ఎందుకు రీ డిజైన్ లో మార్చారని నిలదీశారు ..ఇంట్లో సరిచేసుకోలేని సన్నాసులు దేశ రాజకీయాలు చేస్తారట…..అసెంబ్లీ లో బుద్ధి చెప్పినా పార్లమెంట్ లో బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదు.. బనకచర్ల మీద కాళేశ్వరం పైన బొక్కినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ మండిపడ్డారు ..పెద్దాయన ను ఇబ్బంది పెట్టేలా కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని దెప్పిపొడిచారు ..పిచ్చి మాటలు రోత మాటలు మాట్లాడి రాజకీయాలు దిగ జార్చోద్దు…..విందుల్లో విలాసాల్లో మునిగి గోదావరి కృష్ణా నదుల వాటాలు దారాదత్తం చేసారు.. ఏ మొహం పెట్టుకుని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు…మీ పాలనలో జరిగిన విధ్వంసం సరి చేసేందుకు ఇంత కాలం పట్టిందని తుమ్మల పేర్కొన్నారు ..రైతు శవాల పై పేలాలు ఏరుకుని అధికారం లోకి రావాలని మీ కలలు కలగానే మిగులుతాయని అన్నారు ..ముఖ్యమంత్రి,ప్రధానమంత్రి లాంటి వారి పై మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం తో మాట్లాడాలి..మీ పాలనలో పడావు పడ్డ సీతారామ ప్రాజెక్ట్ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు ..రాజీవ్ లింక్ కెనాల్ తో సాగర్ ఆయకట్టు కు గోదావరి నీళ్ళు అందిస్తున్నాం