హైద్రాబాద్ వార్తలు

హైద్రాబాద్ లో దంచికొట్టిన వాన …నదులను తలపించిన రహదార్లు

హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం కుండపోత వాన కురిసింది. ఈ భారీ వర్షాలకు సిటీలోని మెయిన్ రోడ్లు నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అమీర్పేట్ మైత్రివనం జంక్షన్ దగ్గర, మెట్రో స్టేషన్ చుట్టుముట్టూ సముద్రాన్ని తలపించింది. మోకాలి లోతు కాదు.. ఏకంగా నడుముల లోతు వరద నీరు జామ్ అయింది. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర వరద నీళ్లు జామ్ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమీర్ పేట్ చుట్టుపక్కల ఉండే పబ్లిక్ ఈ వీడియోలను చూసి బిత్తరపోయారు.

మునుపెన్నడూ లేని విధంగా ఆ స్థాయిలో వరద నీళ్లు నిలిచిపోవడంతో మైత్రివనం జంక్షన్ దగ్గర పరిస్థితి ఆగంఆగంగా ఉంది. మైత్రివనం బస్టాప్ మొత్తం వరద నీటిలో మునిగిపోవడంతో అప్పటి దాకా అక్కడున్న జనం దూకేసి ఆ బిల్డింగ్ వైపు వెళ్లారు. ఇక.. సిటీలోని ఇతర ప్రాంతాల విషయానికొస్తే.. నాంపల్లి స్టేషన్ రోడ్లోని కామత్ హోటల్లోకి వరద నీరు చేరింది. దీంతో.. హోటల్లో లంచ్ చేయడానికి వెళ్లిన కస్టమర్లు అక్కడే చిక్కుకుపోయారు. వర్షం ఆగిపోయాక.. వరద ప్రభావం తగ్గాక కస్టమర్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోండా మార్కెట్, క్లాక్ టవర్, ఎంజీ రోడ్డు, బేగంపేట్, రసూల్ పుర, బోయిన్ పల్లి, తిరుమల గిరి, మారేడు పల్లి, అడ్డగుట్ట, మెట్టు గూడ, సీతాఫల్ మండితో పాటు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు వరద కాలువలుగా మారిపోయాయి.

కూకట్ పల్లి అల్విన్ కాలనీ తులసీ నగర్లో రెండు బైక్స్ వరదలో కొట్టుకొచ్చాయి. భారీ వర్గానికి నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి.. విరించి సిగ్నల్ వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంట పాటు అడుగు కూడా వాహనాలు కదలకపోవడంతో వాహనదారులు నరకం చూశారు. పైన వర్షం.. కింద ట్రాఫిక్ జాం.. ఇలా రెండు విధాలుగా వాహనదారులు యాతన పడ్డారు.

హైదరాబాదులో దంచి కొట్టిన వర్షం… ట్రాఫిక్ కష్టాలు

Hyderabad Rains Cause Traffic Chaos in City
  • హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం భారీ వర్షం
  • జలమయమైన రోడ్లతో పూర్తిగా స్తంభించిన ట్రాఫిక్
  • ఐటీ కారిడార్, కోఠి, బేగంబజార్‌లో తీవ్ర ఇబ్బందులు
  • రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, పోలీసు బృందాలు
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచన

భాగ్యనగరాన్ని సోమవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. పగలంతా ఎండతో అల్లాడిన నగరవాసులకు, సాయంత్రం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం ఊహించని కష్టాలను తెచ్చిపెట్టింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో మొదలైన వాన, గంటల తరబడి దంచి కొట్టడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నగరంలోని ఐటీ కారిడార్, బేగంబజార్, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్ట వంటి కీలక ప్రాంతాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా కనిపించింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), నగర పోలీసు యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగాయి. జీహెచ్‌ఎంసీకి చెందిన అత్యవసర బృందాలు రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులను ముమ్మరం చేశాయి. మరోవైపు, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో, నగర పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షం తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం అందింది.

Related posts

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో … లగ్జరీ ఫ్లాట్లకే జై కొడుతున్న నగరవాసులు!

Ram Narayana

శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఎట్టకేలకు చిక్కిన చిరుత…

Ram Narayana

హైడ్రాపై పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు…

Ram Narayana