జగన్ సెక్యూర్టీలో మరో 40 ప్రవేట్ గార్డ్స్ …
జగన్ సెక్యూరిటీలో కొత్త మార్పులు చేసిన వైసీపీ.
జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ.
రోప్ పార్టీ, ప్రత్యేక సెక్యూరిటీ పనిలో ఆ నలభై మంది.
ఇప్పటికే పదిమంది రిటైర్డ్ ఆర్మీని పెట్టుకున్న జగన్.
జగన్ కారు మీదకు దూసుకు వస్తున్న జనం, కార్యకర్తలు.
జగన్కు ఇబ్బందిగా మారుతున్న పర్యటనలు.
ఎల్లుండి డోన్ పర్యటనతో అందుబాటులోకి వచ్చే అవకాశం.
జెడ్ ప్లస్ భద్రత కలిగి ఉన్న ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో జనం తోసుకొని వాహనం మీదకు రావడం ,ప్రస్తుతం ఉన్న సిబ్బంది కంట్రోల్ చేయలేకపోవడంతో భద్రతను పెంచడంతోపాటు మరింత కట్టుదిట్టం చేయాలనీ వైసీపీ నిర్ణయించింది …ఇందుకోసం ఇప్పుడున్న సెక్యూరిటీకి తోడు మరో 40 మంది ప్రవేట్ సెక్యూరిటీని తీసుకోవాలని నిర్ణయించారు ..రోప్ పార్టీ ప్రత్యేక సెక్యూరిటీలో ఆ 40 మంది ఉండేలా చర్యలు చేపట్టారు …ఇప్పటికే జగన్ సెక్యూర్టీలో 10 మంది రిటైర్డ్ ఆర్మీ అధికారులు ఉన్నారు ..వారి పర్వేక్షణలో సెక్యూర్టీ విభాగం పనిచేస్తుంది …పర్యటనల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటారు …ఈనెల 6 న డోన్ పర్యటనలో ఈ మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది …జగన్ కు అదనపు సెక్యూర్టీ కావాలని రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలను కోరారు ..కోర్ట్ ను కూడ ఆశ్రయించారు …అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న భద్రత సరిపోతుందని అదనపు భద్రత అవసరం లేదని తేల్చి చెప్పింది …దీంతో జగన్ తన భద్రత కోసం సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు …
Save or share this story as a newspaper-style Epaper Clip: