ప్రమాదాలు ...

బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్ చూసుకుని వెళుతుండగా ప్రమాదం… ఆరుగురి పరిస్థితి విషమం

  • డోన్ లో బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్
  • వేడుకకు హాజరైన జగన్
  • ట్రాలీ ఆటో బోల్తాపడి 30 మందికి గాయాలు

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ ఈరోజు డోన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ రాకతో డోన్ జనసంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక అపశృతి చోటుచేసుకుంది. 

హైవేపై వెల్దుర్తి వద్ద టైరు పేలి ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెల్దుర్తి ఆసుపత్రికి, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు బేతంచర్ల మండలం రుద్రవరంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారంతా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. వేడుక అనంతరం తిరిగి వెళుతుండగా ప్రమాదం సంభవించింది.

Related posts

తమిళనాడులో ఐదుగురు ఏపీ యువకుల దుర్మరణం…

Ram Narayana

ఫ్రిజ్ పేలిపోయింది… ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు!

Ram Narayana

అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో ఖమ్మం జిల్లా విఎం బంజర వాసి మృతి…

Ram Narayana