పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఖమ్మంలో భారీ సంఘీభావ ర్యాలీ…
ర్యాలీకి తరలివచ్చిన ఖమ్మం ప్రజలు
పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబెడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ
భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు


పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు గురువారం ఖమ్మం నగరంలో ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్న జాతి హనన చర్యలకు నిరసనగా భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొని పాలస్తీనాకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు …రాజకీయ చైతన్యానికి నిలయమైన ఖమ్మంలో జరిగిన ఈర్యాలీ సుమారు రెండు కిలోమీటర్లు సాగింది …పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లాపరిషత్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తన సంఘీభావం ప్రకటించారు …ప్రత్యేకించి డాక్టర్లు , లాయర్లు , వ్యాపారులు , రాజకీయ పార్టీల ప్రముఖులు , యువజన ,విద్యార్ధి సంఘాలు , జర్నలిస్టులు ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం …
ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నా సిపిఐ , సిపిఎం , మాస్ లైన్, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలో అగ్రభాగాన నడిచారు.

వివిధ మైనారిటీ సంస్థలకు చెందిన మహిళలు, యువకులు జాతీయ జెండాలు, పాలస్తీనా జెండాలతో సంఘీభావం ప్రదర్శిస్తూ ‘సేవ్ గాజా’ అనే నినాదంతో హెూరెత్తించారు. వివిధ ప్రజాసంఘాలు, విద్యార్ధి, యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ర్యాలీలో నడిచారు. మార్చ్ ఫర్ హ్యూమానిటీ పేరుతో గాజాలో పాలస్తీనా జాతి హననానికి ఇజ్రాయెల్ చేస్తున్న దుశ్చర్యలను ఖండించారు. నెతన్యాహుని యునైటెడ్ నేషన్స్ యుద్ధ నేరస్తునిగా ప్రకటించిందనీ, ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలో మానవతా సాయాన్ని కూడా అందకుండా చేస్తుందనీ, ఆహార పదార్థాలు, మందులు అందకుండా చేసి ఆకలి చావులకు గురిచేస్తుందనీ వివరించారు.
ఆసుపత్రులు, స్కూళ్ళు నివాస స్థలాలపై బాంబులు కురిపించి వందలాది మంది డాక్టర్లను, వేలాది మంది పసిపిల్లలను చంపిన ఇజ్రాయెల్ చర్యలను ర్యాలీలో ఖండించారు. తక్షణమే యుద్ధాన్ని ఆపివేయాలనీ, గాజాలో ఆహార పదార్థాలు, మందులు, మానవతా సాయాన్ని పునరుద్ధరించాలనీ ఈ ప్రదర్శన డిమాండ్ చేసింది.
ఈ ర్యాలీలో ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల నాయకులు మువ్వా శ్రీనివాసరావు, కాంతారావు, వీరారెడ్డి, శేషగిరి, మతీన్, రవిమారుత్, రమణారావు, ప్రసాద్, వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఐఎంఎ అధ్యక్షులు కంబంపాటి నారాయణ రావు, జి.వి.జగదీష్, రవీందర్, నాగమణి, గోపీనాథ్, రహానా, కృష్ణరావు, భారవి లు పాల్గొన్నారు.




లాయర్లు జక్కంపూడి నాగేశ్వర రావు, తిరుమల రావు, శేషగిరి, విప్లవ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ ర్యాలీని ఉద్ద్యేశించి సిపిఐ కేంద్ర నాయకులు అజీజ్ పాషా, జిల్లా కార్యదర్శి దండి సురేష్ , సిపిఎం నున్నా నాగేశ్వర రావు డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్, కాంగ్రెస్ పార్టీ మొక్కా శేఖర్ గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి పి.నాగరాజు , గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్ , మాస్ లైన్ రాష్ట్రనాయకులు పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు , న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకులు ఆవునూరి మధు , జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ , జమాతే ఇస్లాం జిల్లా అధ్యక్షులు జైనూల్ పాష, మహ్మద్ ఇలియాస్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ ఇంకా అనేక మంది ప్రసంగించారు.ఈ ర్యాలీ నిర్వహణలో విద్యార్థి సంఘ నాయకులు రామకృష్ణ, వెంకటేష్, ప్రవీణ్, మస్తాన్లు యువజన సంఘాల నాయకులు బషీర్, శివరామ కృష్ణ, పుల్లయ్య, రాకేష్ మహిళా సంఘాల నాయకులు బండి పద్మ, పోటు కళావతి, ఝాన్సీ, లక్ష్మి పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, జర్నలిస్ట్ నాయకులు ఏనుగు వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, ఖదీర్, జాలాలుద్దీన్, చిర్రా రవి సంఘీభావ కమిటీ సభ్యులు కాకి భాస్కర్, విజయ్, బండారు రమేష్, ప్రసేన్, సీతారాం లు పాల్గొన్నారు.


