సినిమా వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు మరిచిపోయిన ఎన్టీఆర్

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఈవెంట్ అనంత‌రం సారీ చెప్పిన వైనం
ఈ మేర‌కు ప్ర‌త్యేకంగా వీడియో రిలీజ్ చేసిన ఎన్‌టీఆర్‌
బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. దీంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు ఇద్ద‌రు హీరోల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అలాగే ఇరు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు.

ఇక‌, ఈ కార్య‌క్ర‌మం ముగిసిన అనంత‌రం తార‌క్ క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ ఈవెంట్ స‌జావుగా జ‌రిగి, గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంలో స‌హ‌క‌రించిన తెలంగాణ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు చెప్ప‌డం మ‌రిచిపోయినందుకు సారీ చెప్పారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆయ‌న ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

ఎన్‌టీఆడ‌ర్ మాట్లాడుతూ.. ముఖ్య‌మైన విష‌యం చెప్ప‌డం మ‌రిచిపోయాను. న‌న్న క్ష‌మించాలి. ఈవెంట్ స‌జావుగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క , పోలీస్ డిపార్ట్‌మెంట్ అందించిన మ‌ద్ధ‌తుకు పాదాభివంద‌నాలు. ఎంతో బాధ్య‌త‌తో అభిమానుల ఆనందానికి కార‌ణ‌మ‌య్యారు” అని అన్నారు.

Related posts

‘శకుంతల’ పాత్రకి ముందుగా సమంతను అనుకోలేదు: గుణశేఖర్

Drukpadam

సిమిమా రాజకీయాలు …”వ్యూహం “పై టీడీపీ అభ్యతరం …

Ram Narayana

కృష్ణ-ఎన్టీఆర్ మధ్య విభేదాలు.. మళ్లీ ఒక్కటి చేసిన ‘తెలుగు వీర లేవరా’!

Drukpadam